Vijayawada CYCLE CLUB

Vijayawada CYCLE CLUB PROMOTIN CYCLING

08/04/2023

*జర్నలిజం చేయాలి అనుకుంటున్నారా...?*

*జర్నలిస్ట్ ల నైపుణ్యం మెరుగు పరిచేందుకు డిప్లమో ఇన్ జర్నలిజం*

*ANU-Press Academy సంయుక్త ఆద్వర్యంలో జర్నలిజం కోర్సు*

*నామ మాత్రపు ఫీజు జర్నలిజంలో లెర్నర్స్ కి ఈ కోర్స్ చాలా అవసరం.*

*ఏప్రియల్ 15 దరఖాస్తుకు చివరి తేదీ.*

*క్రింది లింక్ ద్వారా వీక్షించ గలరు.*

22/01/2017
19/01/2017

అందరికి ఇదే మా ఆహ్వానం

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 22న 10K సైక్లింగ్

1)-స్వామి వివేకానంద 154 జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ, యాక్టివ్ బైస్కలర్స్ అసోసియేషన్, విజయవాడలోని సైకిల్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో 22.01.2017 ఆదివారం ఉదయం 6.30 గంటలకు విజయవాడలోని కారల్ మార్క్స్ రోడ్ (ఏలూరు రోడ్డు)లోని SRR నుంచి 10 K సైక్లింగ్ జరుగుతుంది.

2)-ఈ సైక్లింగ్ లో కొద్దిపాటి దూరానికి ప్రయాణ సాధనంగా సైకిల్ వినియోగించడంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన మొట్టిమొదటి ప్రభుత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ ధళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ ధళం విజయవాడ కమాండెంట్ (జోనల్ ఆఫీసర్) కె.ఎన్.రావు గారు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (APJF) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. కృష్ణాంజనేయలు గారు, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రాజధాని ప్రాంతంలో విధుల్లోకి చెరడానికి హైదరాబాదు నుంచి వెలగపూడి వరకు సైకిల్ పై వచ్చిన కృష్ణాజిల్లా ఆడపడుచు (ACTO) ఎం.పద్మ చౌదరి అతిధులుగా పాల్గొంటారు.

3)-స్వామి వివేకానం జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, కొద్దిపాటి దూరానికి , ముఖ్యంగా ఇంటి నుంచి ఆఫీసులకు, స్కూల్స్, కాలేజీలకు వెళ్ళేందుకు ప్రయాణ సాధనంగా సైకిల్ వినియోగించడం ద్వారా ఇంధనం, డబ్బు పొదుపు చేయాలని, పర్యావరణాన్ని రక్షించాలని, పట్టణాల్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ముందుకు రావాలని బోనస్ గా ఆరోగ్యంగా జీవించాలని ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు గుర్తు చేస్తూ ఈ సైకిల్ ర్యాలీ జరుగుతోంది.

4)-ఈ ర్యాలీ SRR కాలేజీ వద్ద ప్రారంభమై ఏలూరు రోడ్డు మీదగా గుణదల మేరీ మాత గుడి దగ్గరలో BRTS రోడ్డులోకి మళ్ళి బిఆర్టీఎస్ రోడ్డు చివర మీసాల రాజారావు వంతెన వద్ద నుంచి అదే రోడ్డు మీదగా అల్లూరి సీతారామ రాజు వంతెన మీదగా ఏలూరు రోడ్డులోని BSNL భవన్ మీదగా తిరిగి SRR ప్రభుత్వ కాలేజీ వద్ద ముగుస్తుంది.

4)-ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికి కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ సర్టిఫికెట్స్ అందజేస్తుంది. కనుక ఈ ర్యాలీలో నగరంలోని విద్యార్థులు, యువత పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పాల్గొనే వారి తమ పేరు, ఫోన్ నెంబరు, ప్రాంతం తెలియజేస్తూ 21వ తేదీ సాయంత్రం లోగా 9440978939, 9985377455 కి SMS పంపాలని కోరారు. వివరాలకు 9440978939లో సంప్రదించాలని సూచించారు.

VALLABHANENI SATYANARAYANA. VIJAYAWADA

29/12/2016
28/12/2016

TO,
ముఖ్యకార్యనిర్వాహణాధికారి గారికి, 29.12.2016
యువజన సంక్షేమ శాఖ, కృష్ణాజిల్లా.విజయవాడ.520008.
SIR,
విషయం:-ఢిల్లీ నుంచి అమృత్ సర్-వాఘా బోర్డర్ వరకు 2017 జనవరి
1 నుంచి 9 వరకు జరిగే సైకిల్ యాత్రకు ప్రోత్సాహం, చేయూత
కొరకు విన్నపం.
*****
1)-కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ అనుబంధ సంస్థగా ఏర్పడిన యాక్టివ్ బైస్కలర్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా సంక్షేమ శాఖ సహాయం, చేయూతతో ఇప్పటికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. కొద్దిపాటి దురానికి అంటే ఇంటి నుంచి ఆఫీసులకు, స్కూల్స్, కాలేజీలకు వెళ్ళేందుకు ప్రయాణ సాధనంగా సైకిల్ వినియోగించండి, ఇంధనం, డబ్బు పొదుపు చేయండి, పర్యావరణాన్ని రక్షించించండి, పట్టణాల్లో ట్రాఫిక్ ను నియంత్రించండి, సైకిల్ తొక్కేవారిని ప్రోత్సహించండి, గౌరవించండి అంటూ 2009లో మొదటిగా విజయవాడ నుంచి హైదరాబాదు వరకు సైకిల్ యాత్ర నిర్వహించడంతో ప్రారంభమై అనేక యాత్రలు చేయడంతోపాటు 2011 సంవత్సరంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి సైకిల్ యాత్ర పూర్తి చేయడం జరిగింది.
2)-ఇప్పుడు ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు ఢిల్లీ నుంచి వాఘా బోర్డరు వరకు శాంతిని కోరుతూ, సైకిల్ వినియోగం వల్ల ప్రయోజనాలను తెలియజేస్తూ సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో యాక్టివ్ బైస్కలర్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయిన విజయవాడ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో 14 మంది పాల్గొంటున్నారు. ఇందు కోసం కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ నుంచి ప్రోత్సాహం, చేయూత అందించాలని కోరుచున్నాం.
1)-VALLABHANENI SATYANARAYANA, 2)-CH.AISHWARYA 3)-CH.DIVYA 4)-CH.PRAVALIKA, 5)-R.SRINIVASA RAO, 6)-G.PADMAJA 7)-G.AMAR, 8)-G.SAMAR, 9)-A.CH.SEKHAR, 10)-K.CHANDU 11)-CH.DILLEP 12)-V.SRINU 13)-UNDAVALLU KRISHNAVENI, 14)-GOWRU.
కృతజ్ఞతలతో ఇట్లు
తమ విధేయుడు, సైక్లిస్టు
వల్లభనేని సత్యనారాయణ

TO,ముఖ్యకార్యనిర్వాహణాధికారి గారికి,                               29.12.2016                                           ...

18/12/2016

G

ఈ న్యూస్ ను పంపిన శంకర్ కంకిమళ్ళ గారికి కృతజ్ఞతలు2009లో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన విజయవాడ సైకిల్ క్లబ్ (యాక్టివ్ బ...
23/11/2016

ఈ న్యూస్ ను పంపిన శంకర్ కంకిమళ్ళ గారికి కృతజ్ఞతలు

2009లో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన విజయవాడ సైకిల్ క్లబ్ (యాక్టివ్ బైస్కలర్స్ అసోసియేషన్) సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆవగింజంత ప్రయత్నం తో అడుగులు ప్రారంభించింది.

తరువాత క్యాపిటల్ సైకిల్ క్లబ్, అమరావతి బైసైక్లింగ్ క్లబ్, గుంటూరులో కొంత మంది డాక్టర్లు కలిసి సైకిల్ క్లబ్ లు ఏర్పాటు చేసి ఆవగింజను తాటికాయంత చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కి ఎంతో ఆప్తులు మనోహర్ గారు చేసే ప్రయత్నం గుమ్మడికాయంత అవుతుందని ఆశిస్తున్నాను.

ఇంకా సైకిల్ క్లబ్ లు ఏర్పాటు కావలసిన అవసరం ఉంది.

వల్లభనేని సత్యనారాయణ, విజయవాడ. 9440978939.

న‌గ‌రాల్లో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు సైక్లింగ్‌ను ప్రోత్స‌హించాలి
* సీఎం చంద్ర‌బాబు సూచ‌న
* సైక్లింగ్‌ అవ‌గాహ‌న ఒప్పందాల‌పై ఆల్ ఇండియా బైసైక్లింగ్ ఫెడ‌రేష‌న్‌, సీఆర్డీఏలు సంత‌కాలు
* విజ‌య‌వాడ‌లో తొలి ద‌శ‌లో మూడు బైక్ స్టేష‌న్‌ల ఏర్పాటు
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నగరాలలో కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా సైక్లింగ్‌ను ప్రొత్స‌హించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. న‌గ‌రంలోని సీఎం విడిది కార్యాలయంలో బుధవారం జ‌రిగిన సీఆర్డీఏ కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన సందర్భంగా "ఆల్ ఇండియా బైసైక్లింగ్ ఫెడరేషన్ సీఆర్డీఏలు సైక్లింగ్ ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ అంశంపై సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని నగరంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో సైక్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నగర వనాలలో, పార్కుల్లో సైకిల్ పార్కుల‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. విజయవాడ నగరంలోని కాలువ గట్లు, కొన్ని రోడ్లలో ప్రత్యేకంగా సైక్లింగ్‌ను ప్రోత్స‌హించాలని పేర్కొన్నారు. సైక్లింగ్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పర్యావరణ అనుకూలత కూడా ఏర్పడుతుందని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని నగరంలో 1620 కి.మీ. మేర ఉన్న రహదారులలో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ నగరంలో తొలి దశలో మూడు చోట్ల బైక్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్లలో ఒక్కొక్కటి, బెంజిస‌ర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఉన్న ప్రాంతంలో మ‌రొక బైక్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ఆల్ ఇండియా బైసైక్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ డి. మనోహర్ మాట్లాడుతూ వెలగపూడి సచివాలయంలో మొట్టమొదటి పబ్లిక్ షేరింగ్ సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి రాజధానికి తరలివచ్చే సందర్శకుల కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలలో సైక్లింగ్ పై మక్కువ పెంచేందుకు డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున సైక్లింగ్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు ప్ర‌క‌టించారు. తొలి దశలో 200 అధునాతన సైకిళ్ళతో మూడు సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాన్ మోటరైజ్ రవాణా వ్యవస్థను నగరాల్లో ప్రొత్సహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నగరాలలో కాలుష్యాన్ని నివారించేందుకు, వాహ‌న ర‌ద్దీని నియంత్రించేందుకు సైక్లింగ్ వ్య‌వ‌స్థ ఎంత‌గానో దోహదపడుతుందన్నారు. దీంతో పాటు శారీరక ధృఢత్వం, ఆరోగ్యం కూడా పెంపొందుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో కూడా సైక్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంద‌ర్భంగా అవగాహన ఒప్పందం పత్రంపై సీఆర్డీఏ తరఫున కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆల్ ఇండియా బైసైక్లింగ్ ఫెడరేషన్ తరపున ఆ సంస్థ చైర్మన్ డి. మనోహర్‌లు సంతకం చేశారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ‌ మంత్రి పి. నారాయణ, రాజధాని సలహాసంఘం స‌భ్యులు, మాజీ శాసనసభ్యులు బీదా మస్త‌న్‌రావు, ఇంధన శాఖ, సీఆర్డీఏల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏడీసీ ఛైర్‌ప‌ర్స‌న్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియ‌న్‌, గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి, ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్లు డాక్టర్ ఎ.మల్లిఖార్జున, వి.రామమనోహరావు, తదితరులు పాల్గొన్నారు.

Address

48. 11. 7/1, TF-4, SRI SAI NIVAS, 2ND Lane, KETHINENI VARI STREET, CURRENCYNAGAR
Vijayawada
520008

Telephone

9440978939

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijayawada CYCLE CLUB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share