Sports Authority of Andhra Pradesh

Sports Authority of Andhra Pradesh "From grassroots dreams to elite glory, we celebrate every champion’s journey.”
“Play with passion. Win with pride.”

01/09/2026

క్రీడలకు కొత్త శకం… యువతకు కొత్త దిశ!

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు మరింత ప్రాధాన్యత లభిస్తోంది.

అమరావతి ఛాంపియన్‌షిప్–2026
క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీస్తూ…
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా శక్తిగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు!

— శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
యువజన & క్రీడల శాఖ మంత్రి

శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలుతిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ...
15/08/2026

శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాప్ చైర్మన్ శ్రీ అనిమిని రవి నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రవి నాయుడు గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వెల్లడించారు.

రాష్ట్రంలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ఆధునిక క్రీడా మౌలిక వసతులు, విస్తృత అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో క్రీడాకారులు కీలక భాగస్వాములుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశభక్తి స్ఫూర్తితో...
క్రీడా ప్రగతి దిశగా ఆంధ్రప్రదేశ్!

జై హింద్!

దేశభక్తి స్ఫూర్తితో... క్రీడా ప్రగతి దిశగా SAAP!విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయంలో 80వ స...
15/08/2026

దేశభక్తి స్ఫూర్తితో... క్రీడా ప్రగతి దిశగా SAAP!

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా SAAP Vice Chairman & Managing Director శ్రీమతి ఎస్. భరణి, IFS గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం నిర్వహించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాల స్ఫూర్తితో క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందిస్తూ బలమైన భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జై హింద్!
వందే మాతరం!

This Independence Day, we celebrate the spirit that unites every athlete — across every sport, every playing field and e...
15/08/2026

This Independence Day, we celebrate the spirit that unites every athlete — across every sport, every playing field and every journey.

Different sports. Different dreams. Different journeys.
One flag. One nation. One spirit.

To every athlete who trains, competes, perseveres and represents — Jai Hind!

Sports Authority of Andhra Pradesh
Government of Andhra Pradesh


12/08/2026

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 | నెల్లూరు జిల్లా

నెల్లూరు నుంచి కొత్త క్రీడా ప్రతిభకు వేదిక!

SAAP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్ 2026లో భాగంగా నెల్లూరు జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, తమకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గెలుపు మాత్రమే కాదు... తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే సంకల్పంతో ప్రతి క్రీడాకారుడు ముందుకు సాగుతున్నాడు.

జిల్లా స్థాయిలో వెలుగులోకి వస్తున్న ఈ ప్రతిభకు మరింత ప్రోత్సాహం అందిస్తూ, ఉన్నత స్థాయి పోటీలకు క్రీడాకారులను సిద్ధం చేసే దిశగా అమరావతి ఛాంపియన్‌షిప్ ముందుకు సాగుతోంది.

ఒక వేదిక... ఎన్నో కలలు...
నెల్లూరు నుంచి ఛాంపియన్ల దిశగా కొత్త ప్రయాణం!

11/08/2026

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 | పశ్చిమ గోదావరి జిల్లా

క్రీడా ప్రతిభతో కళకళలాడుతున్న పశ్చిమ గోదావరి!

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 – పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ హోరాహోరీగా పోటీపడుతున్నారు. మైదానాల్లో కనిపిస్తున్న పోటీతత్వం, క్రీడా స్ఫూర్తి, యువ క్రీడాకారుల ఉత్సాహం పోటీలకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి.

ప్రతిభను గుర్తించి, క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలను అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్ పశ్చిమ గోదావరి జిల్లాలో క్రీడా వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

మైదానంలో ప్రతిభ... గెలుపుపై గురి...
పశ్చిమ గోదావరి నుంచి ఛాంపియన్ల దిశగా అడుగులు!

Address

IGMC Stadium Bandar Road
Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when Sports Authority of Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category