RaituNestham

RaituNestham Raitu Nestham, a friend of Farmers working for development of farming society. Intoduces innovative farming ideas through digital platforms.

Conducts training classes on organic / natural farming /Terrace gardening/ Millets promotion in AP & TS states.

** ప్రముఖ రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డికి ‘రైతునేస్తం’ జోహార్లు ** ------------------------------------------------...
24/08/2026

** ప్రముఖ రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డికి ‘రైతునేస్తం’ జోహార్లు **
------------------------------------------------------------------------------
సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి, రైతుల హక్కుల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన రైతు సంఘం అగ్రనేత సారంపల్లి మల్లారెడ్డి గారు ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు.

వారి మృతి తీవ్రంగా కలచివేసిందని, రైతు కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు మల్లారెడ్డి గారని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు.

రైతు సమస్య ఏదైనా… దాని పరిష్కారం కోసం ఆయన గొంతు ఎప్పుడూ వినిపించేది. రైతాంగం కోసం ఆయన చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.

మల్లారెడ్డి గారి మరణం రైతు ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా… రైతుల కోసం ఆయన సాగించిన పోరాట స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుందని యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు.

ఆయనను కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సారంపల్లి మల్లారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయనకు నా ఘనమైన నివాళులు.

ఈ నిస్వార్థ రైతునేతను రైతునేస్తం మాసపత్రిక 17వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 30, 2021న రైతునేస్తం జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించి గౌరవించింది.

సారంపల్లి మాల్లారెడ్డి గురించి….

తెలుగునాట సారంపల్లి మల్లారెడ్డి తెలియని రైతు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎనిమిది దశాబ్దాలు పైబడిన వారి జీవితంలో ఆరు దశాబ్దాల కాలం తాను నమ్ముకున్న భావజాలంతో రైతాంగ పక్షపాతిగా,
రైతు ఉద్యమనేతగా నిస్వార్థంగా పనిచేసి జాతీయస్థాయికి ఎదిగిన రైతునేత వీరు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే ఎక్కడ రైతుకు అన్యాయం జరిగితే అక్కడ సారంపల్లి ప్రత్యక్షమవుతారు. ఎటువంటి భేషజాలకు పోకుండా అధైర్యపడకుండా రైతుపక్షాన నిలబడటమే వీరికి తెలుసు. రైతు, రైతు కూలీల సంక్షేమమే వారి శ్వాస, ధ్యాస, వారి ఆశ కూడా. 1973 వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా రైతుల తరఫున పోరాటం ప్రారంభించారు. అప్పుడు ప్రాంతంలోని కొత్తగూడెం, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి మండలాలలోని రైతుల భూసమస్యలను, బ్యాంకు, సహకార సంఘాల రుణ సమస్యలను, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో కృషిచేస్తూ తన పోరాట పటిమను ప్రదర్శించారు. అప్పటి నుండి ఇప్పటివరకు పనిచేస్తున్న రైతు సంఘంలో అంచలంచెలుగా ఎదిగి 1999లో వారి రైతు సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రైతు సంఘం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు, భూసమస్యలు, విద్యుత్ సమస్యలు, సహకార రుణాలు, పంట రుణాలు, మార్కెట్ సమస్యలు, మార్కెట్ ధరల సమస్యలు, కరవులు, వరదలు నష్టాలు, రైతు ఆత్మహత్యలపైన రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని కదిలించి ఆ సమస్యల పరిష్కారం కోసం వీరు సలిపిన ఎన్నో పోరాటాల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అఖిలపక్ష రైతు సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి తీవ్రంగా శ్రమించారు. జీవిత కాలంలో ఉద్యమాల కారణంగా ఆరు మాసాల జైలుశిక్ష, రెండున్నరేళ్ళ అజ్ఞాత జీవితం గడిపారు. తన అపార అనుభవంతో 2008లో ‘రైతు ఉద్యమ చరిత్ర’ పుస్తకంతో ప్రారంభమైన వీరి అక్షర యాత్ర 2021లో ‘భారత రైతాంగ పోరాటాలు’ మీద సవివరమైన సమాచారంతో పుస్తకం రావటం జరిగింది. ఈ 18 ఏళ్ళ అక్షర ప్రస్థానంలో దాదాపు 30కి పైగా పుస్తకాలను రైతాంగ సమస్యలమీద, వ్యవసాయ సంక్షోభం మీద, తన అపార అనుభవంతో వాటి పరిష్కార మార్గాలు సూచిస్తూ తీసుకువచ్చి ముందుతరాలకు మార్గదర్శకంగా నిలిచారు.

యడ్లపల్లి వేంకటేశ్వరరావు
పద్మశ్రీ పురస్కార గ్రహీత
ఛైర్మన్, రైతునేస్తం ఫౌండేషన్

2021లో రైతునేస్తం జీవన సాఫల్య పురస్కారం అందుకుంటూ….

సారంపల్లి మల్లారెడ్డి జీవిత చరిత్ర

01.04.1956 నుండి 01.04.1964 వరకు లక్ష్మారెడ్డి పోలీస్ పటేల్
01.04.1964 నుండి 10.08.1971 వరకు మల్లా రెడ్డి పోలీస్ పటేల్
06.08.1971న తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకుల దాడి – ఎకెగోపాలన్ రావడం
1953లో మల్లారెడ్డి వివాహం
1954లో సారంపల్లి కృష్ణారెడ్డి మరణం (నాన్న)
07.10.1988 అమ్మ రాధమ్మ మరణం
1962లో అర్షనపల్లి వెంకటేశ్వరరావుకు (ఎంఎలఏ ప్రచారం గెలుపు)

25.08.1939 జన్మదినం
1957-58 పదవ తరగతి ఉత్తీర్ణత
06.07.1959 వాసుదేవరెడ్డి జననం
24.08.1962 మధుసూధన్‌రెడ్డి జననం
07.02.1964 కనకలక్ష్మీ మరణం
09.03.1966 భాగ్యలక్ష్మితో వివాహం

27.08.1975 అనిత జననం
15.02.1977 అజిత జననం

తిమ్మంపేట సర్పంచిగా (సిపియం పార్టీ)

ఎస్ మల్లారెడ్డి 12.06.1981 – 30.03.1988

1973 మార్చి పార్టీ సభ్యునిగా – పూర్తి కాలం కార్యకర్తగా – నర్సంపేట పార్టీ డివిజన్ కమిటీ
రైతు సంఘం :
1973 – నర్సంపేట డివిజన్ రైతుసంఘం కార్యదర్శిగా
1981- వరంగల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా
25.06.1978 రాష్ట్ర రైతు సంఘం 9 (హైదరాబాద్ మహాసభ)
10.05.1992 రైతు సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్‌గా 14 (మధిర మహాసభ)
17.02.1999 రాష్ట్ర అధ్యక్షునిగా 16 (వరంగల్ మహాసభ)
21.02.2003 రాష్ట్ర కార్యదర్శిగా 17 (కర్నూల్ మహాసభ)
09.03.2003 ఏఐకెఎస్ ఉపాధ్యక్షునిగా (30వ మహాసభ)
సిపియం పార్టీ :
11.10.1981 వరంగల్ జిల్లా కమిటీకి 8 (నల్లబెల్లి మహాసభ)
25.08.1985 వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గం 9 (ఇప్పగూడెం మహసభ)
03.11.1991 పార్టీ రాష్ట్రకమిటీ సభ్యునిగా (విశాఖ)
28.01.2005 పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం (వరంగల్ మహాసభ)
04.03.2015 కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా (హైదరాబాద్ మహాసభ)
07.02.2018 రాష్ట్ర కమిటీ ఆహ్వానితునిగా (నల్గొండ మహాసభ)

అఖిల భారత మహాసభకు డెలిగేట్ 16వ మహాసభను 22వ మహాసభ వరకు డెలిగేట్

చదువు (ఎస్ మల్లారెడ్డి)
1949 – 50 మహబూబియా – వరంగల్ (2వ తరగతి)
1950 – 51 మహబూబియా – వరంగల్ (3వ తరగతి)
1951 – 52 మహబూబియా – వరంగల్ (4వ తరగతి)
1952 – 53 వేయిస్తంభాల గుడి – హన్మకొండ (5వ తరగతి)
1953 – 54 వస్తానియా వరంగల్ (6వ తరగతి)
1954 – 55 హైస్కూల్-నర్సంపేట (7వ తరగతి)
1955 – 56 వరంగల్ (8వ తరగతి)
1956 – 57 వరంగల్ (9వ తరగతి)
1957 – 58 వరంగల్ (10వ తరగతి) కుమార్‌పల్లి – హన్మకొండ

రచించిన పుస్తకాలు

రైతు ఉద్యమ చరిత్ర 1947-2007 (2008)
బడుగు రైతుల వెతలు 2008.
కమిషన్లు – రెకమండేషన్లు ఏప్రిల్ 2014.
కార్పొరేట్ దిశన వ్యవసాయం 2013.
రాష్ట్రంలో నదీజలాలు – ప్రాజెక్టులు – వినియోగం – వివాదాలు-జూన్ 2013.
తెలంగాణలో సాగునీటి వనరులు – అవకాశాలు-నవంబర్ 2015.
తెలంగాణ రైతాంగ భూ ఉద్యమాలు-ఏప్రిల్ 2016.
వ్యవసాయ సంక్షోభంలో రైతులు దివాళా-ఏప్రిల్ 2018.
అత్యంత ధనిక రాష్ట్ర జపం ఒకవైపు – అప్పుల పెనుభారం ఒకవైపు – ఏప్రిల్, 2018.
సహకార రుణాలు-2003.
పత్తి రైతులారా! ఆలోచించండి!!
“రైతు సంక్షేమం” – ప్రభుత్వంలో రైతు మేలెంత.
జనీవా చర్ౘ్ల్లో “ భారత వ్యవసాయరంగానికి రక్షణ కల్పించాలి.
ఎఫ్‌సీఐ వివరాలతో పార్లమెంటు సభ్యులకు పుస్తకాలు.
50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనర్ ఇరిగేషన్ (విశ్లేషణ)
1956 వరకు రైతాంగ పోరాటాలు.
50 సంవత్సరాల సీపీఎం ప్రస్థానం.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలు – వ్యవసాయరంగం – సాగునీటిరంగం.
ఆంధ్రలో రైతాంగ భూ ఉద్యమాలు-ఏప్రిల్ 2018
భారత రైతాంగ పోరాటాలు. 2020
కమ్యూనిజం వైపు అడుగులు & గ్రామంలో పార్టీ నిర్మాణం
తొలి పరిచయాలు: ఖాజీపేట రైల్వే గ్యాంగ్ కూలీ కుమ్మరికుంట్ల బొందయ్య ద్వారా సీపీఎం నాయకుడు ఓంకార్‌తో తిమ్మంపేట గ్రామానికి సంబంధాలు ఏర్పడ్డాయి. బొందయ్య ప్రేరణతో చదువు విరమించిన సారంపల్లి రాజిరెడ్డి ( తమ్ముడు) కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు.
వ్యతిరేకత & నిబద్ధతః గ్రామంలోని పట్వారి, ఇతరులు రాజిరెడ్డితో కమ్యూనిజానికి వ్యతిరేకంగా ప్రకటన చేయించాలని చూసినా ఆయన నిరాకరించాడు. దీంతో వారిపై తప్పుడు కేసులు బనాయించారు. అయినప్పటికీ ముదిరాజులు, గీత కార్మికులు, రజకులు కమ్యూనిస్ట్ పార్టీకి అండగా నిలిచారు.

1962 ఎన్నికల విజయం: 1962 నర్సంపేట అసెంబ్లీ ఎన్నికల్లో పి.డి.ఎఫ్ (కమ్యూనిస్ట్) అభ్యర్థి అరిశెనపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిపై 4,418 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికల్లో పుచ్చలపల్లి సుందరయ్య, ఓంకార్ విస్తృతంగా ప్రచారం చేశారు. వెంకటేశ్వరరావు విజయం తిమ్మంపేట పరిసర గ్రామాల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపి, 45 మంది మిలిటెంట్ సభ్యులతో తిమ్మంపేటను పార్టీకి తలమానికంగా మార్చింది.

రాజకీయ పరిణామాలు & 1971 చారిత్రక ఘటన
చీలికలను తట్టుకుని నిలబడటం: 1964లో సీపీఐ(ఎం) ఆవిర్భావం తర్వాత వరంగల్ జిల్లాలో మెజారిటీ నాయకులు సుందరయ్య నాయకత్వంలోని సీపీఎం వైపు నిలిచారు. 1967లో నక్సలైట్ల చీలిక వచ్చినా (ములుగు తాలూకా మినహా) తిమ్మంపేట పార్టీ దృఢంగా నిలబడింది.
పోలీసుపటేల్‌గా రక్షణః రచయిత అన్న లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా పోటీ చేయడానికి పోలీసుపటేల్ పదవికి రాజీనామా చేయడంతో, 1964లో రచయిత పోలీసుపటేల్‌గా నియమితులై 1971 వరకు పార్టీ కార్యకర్తలను అరెస్టుల నుండి రక్షిస్తూ వచ్చారు.

1971 ఆగస్టు 6న కాంగ్రెస్ నాయకులు 200 మందితో తిమ్మంపేటపై దాడికి ప్రయత్నించగా, పార్టీ నాయకులు (రాజిరెడ్డి, చంద్రారెడ్డి తదితరులు) వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేసి కాంగ్రెస్ మూకలను తరిమికొట్టారు.

ఈ ఘటనతో మల్లారెడ్డి పోలీసుపటేల్ పదవి నుండి సస్పెండ్ చేశారు. 72 మందిపై కేసులు పెట్టి సెంట్రల్ జైలుకు పంపారు.

ఈ నిర్బంధం తెలిసి 1971 ఆగస్టు 18న ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఎ.కె. గోపాలన్ తిమ్మంపేటకు వచ్చి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అదే రోజు నర్సంపేటలో 20,000 మందితో భారీ బహిరంగ సభ జరిగింది. 1973లో మల్లారెడ్డి కి సీపీఎమ్‌లో డివిజన్ కమిటీ బాధ్యతలు లభించాయి.

తిమ్మంపేట గ్రామాభివృద్ధి (42 ఏళ్ల సీపీఎం పాలన)
1964 జూలై 1 నుండి 2006 ఆగస్టు 22 వరకు సుదీర్ఘంగా 42 సంవత్సరాల పాటు తిమ్మంపేట పంచాయతీ, సింగిల్ విండోలు సీపీఐ(ఎం) పాలనలోనే ఉన్నాయి.
సర్పంచ్‌గా కృషి (1981 – 1988):

రచయిత ఏకకాలంలో సర్పంచ్‌గా, సింగిల్‌విండో అధ్యక్షుడిగా, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా సేవలందించారు.

అభివృద్ధి పనులు: High School భవనం, పక్కా పంచాయతీ భవనం, పశువైద్యశాల, తాగునీటి కోసం 2 వాటర్ ట్యాంకులు, 4 బోర్లు ఏర్పాటు చేశారు.

విద్యుద్దీకరణ (1972): అధికారులు మంజూరు చేసిన వారం రోజుల్లోనే శ్రమదానంతో గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేశారు. ప్రజా నిరసన కారణంగా మంత్రులు (జలగం వెంగళరావు, తదితరులు) ప్రారంభించకుండానే వెళ్ళిపోగా, సర్పంచ్ రాజిరెడ్డి నాయకత్వంలోనే ప్రజలు విద్యుద్దీకరణను ప్రారంభించుకున్నారు.

భూపోరాటాలు: 1967లో 110 ఎకరాల ప్రభుత్వ బంచరాయి భూమిని పేదలకు పంచగా, 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో “భూసమారాధన” ద్వారా వాటికి పట్టాలు లభించాయి.

భార్గవ కమిషన్ & సాయుధ పరిణామాలు
1972లో జలగం వెంగళరావు ప్రభుత్వం చేసిన నక్సలైట్ ఎన్‌కౌంటర్లపై సుందరయ్య అసెంబ్లీలో పోరాడి జస్టిస్ భార్గవ కమిషన్ వేయించారు.
నక్సలైట్ నాయకుడు రాంనర్సయ్యను పోలీసులు పాకాల చెరువు వద్ద కాల్చి చంపగా, దానికి సంబంధించిన సాక్షుల నుండి అఫిడవిట్లు తయారు చేసి భార్గవ కమిషన్‌కు సమర్పించే కీలక బాధ్యతను మల్లారెడ్డి నెరవేర్చారు.

మల్లారెడ్డి ప్రభావితం చేసిన సాహిత్యం & మార్క్సిస్ట్ పాఠాలు
రచయిత తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకోవడానికి, సీపీఎంను బలోపేతం చేయడానికి క్రింది పుస్తకాలు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు:
చైనాపై అరుణతార (ఎడ్గార్ స్నో): చైనా ప్రజా సైన్యం లాంగ్‌మార్చ్, త్యాగాలు మరియు మార్క్సిజం పునాదిగా చైనా సాధించిన ప్రగతిని వివరించింది.

జైత్రయాత్ర (చూటే జీవిత చరిత్ర): దురలవాట్లను వదిలి సామాన్యుడి నుండి ఆర్మీ అధిపతిగా ఎదిగిన చూటే జీవితం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

బీళ్లు దున్నేరు?: రష్యా విప్లవానంతరం సోషలిజం వైపు మారే క్రమంలో ఎదురైన ప్రతిఘటనలను ఎదుర్కోవడంపై అవగాహన నిచ్చింది.

బోల్షివిక్ విప్లవ చరిత్రః లెనిన్ ఎత్తుగడలు, ప్రపంచంలో మొదటి సోషలిస్టు రాజ్యం ఏర్పాటు విధానాన్ని తెలియజేసింది.

యువజన, విద్యార్థి రంగాల బలోపేతం:

కే. వెంకటయ్య కార్యదర్శిత్వంలో పి. చంద్రారెడ్డి, సూడి క్రిష్ణారెడ్డి, జి. నాగయ్య, మల్లారెడ్డిలతో కూడిన బృందం జిల్లాలో ఉద్యమాన్ని పునర్నిర్మించింది.

కాకతీయ యూనివర్సిటీ, కళాశాలల్లో SFI/DYFIలను పటిష్టం చేశారు. సారంపల్లి మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎం.చుక్కయ్య తదితరుల నాయకత్వంలో DYFI రాష్ట్ర సమ్మేళనం / యువజనోత్సవాలను వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు.

శ్రీరాంసాగర్ రెండవ దశ, వరద కాలువ పనుల పూర్తికై వరంగల్ జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో 4000 బుక్‌లెట్లు వేసి, 200 గ్రామాల్లో విస్తృత ప్రచారం, ధర్నాలు, జిల్లా బంద్ నిర్వహించారు.

భూపోరాటాలు & అమరవీరుల త్యాగాలు:

ఆసరవెల్లి (నల్లబెల్లి మండలం): ఫారెస్టు పరిధిలో ఉన్న 525 ఎకరాల భూమిని అటవీ శాఖతో పోరాడి, 200 మంది పేదలతో ఆక్రమించి 150 ఇండ్లతో గ్రామాన్ని నిర్మించారు.

అశోకనగర్ (పాఖాల చెరువు వెనుక): 1100 ఎకరాల అడవి బంజరు భూములను పేదలకు దక్కించే క్రమంలో 1980 నుండి తీవ్ర పోరాటాలు జరిగాయి. భూస్వాములు, పోలీసుల దాడుల్లో మన్నూరి చిన్నస్వామి, వేల్పుల కోటయ్య, పన్నీరు యాదగిరిలతో సహా మొత్తం 6గురు ప్రాణాలు కోల్పోయారు.

వరంగల్ పట్టణంలో 18 చోట్ల పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించారు. ఈ పోరాటంలో కాంగ్రెస్, నక్సలైట్ల నిర్బంధాలను తట్టుకుని నిలబడ్డారు. పోరాటంలో కుసుమ రఘునాథ్ (1999), రామాసురేందర్ (2000), అప్పోజు సమ్మయ్య, మంతెన నారాయణరెడ్డి వంటి పలువురు నాయకులు/కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

రచయిత సర్పంచ్‌గా, సహకార సంఘం అధ్యక్షుడిగా గెలిచి, టీడీపీతో కలిసి DCA Bank డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. సూడి క్రిష్ణారెడ్డి (గోవిందరావుపేట), కోట నర్సింహారెడ్డి (జనగామ) మండల అధ్యక్షులుగా గెలిచారు.
1991లో పి.వి. నరసింహారావు హయాంలో అరబ్ దేశాలకు మాంసం ఎగుమతి పథకం కింద పశుసంవర్ధక శాఖ ద్వారా ఏర్పడిన గొర్రెల కాపరుల సంఘాలను సీపీఎం సమర్థవంతంగా నిర్వహించింది.

కలెక్టరేట్ ముందు ఆందోళనలు చేపట్టి, జనగాంలో రాష్ట్ర మహాసభ నిర్వహించింది.

, , , , , , , , , #అఖిలభారతకిసాన్సభ, #కమ్యూనిస్టునాయకుడు, #ఘననివాళి, #జీవితసాఫల్యపురస్కారం, #తిమ్మంపేట, #తెలంగాణ, #తెలంగాణరైతాంగం, #నర్సంపేట, #పద్మశ్రీ, #భూపోరాటాలు, #యడ్లపల్లివేంకటేశ్వరరావు, #రైతాంగఉద్యమం, #రైతుఆత్మహత్యలు, #రైతుఉద్యమం, #రైతునాయకుడు, #రైతునేస్తంఫౌండేషన్, #రైతుపోరాటం, #రైతులహక్కులు, #రైతుసంక్షేమం, #రైతుసంఘం, #రైతుసమస్యలు, #రైతుహక్కులు, #వరంగల్, #వ్యవసాయం, #వ్యవసాయసంక్షోభం, #శ్రద్ధాంజలి, #సాగునీరు, #సారంపల్లిమల్లారెడ్డి, agri news, Agriculture, Andhra Pradesh, ChatGPT said: #రైతునేస్తం, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

** పురుగుల నివారణకు బ్రహ్మాస్త్రం** --------------------------------------ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని అందులో ...
24/08/2026

** పురుగుల నివారణకు బ్రహ్మాస్త్రం**
--------------------------------------
ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని అందులో 2 కిలోల వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకు ముద్ద, 2 కిలోల పల్లేరు ఆకు ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకు ముద్ద వేసి ఒక కర్రతో ఈ మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత పాత్రపైన మూత పెట్టి బాగా (అరగంట) ఉడికించాలి. ఆ తర్వాత పాత్రను క్రిందికి దించి 48 గంటల వరకు చల్లారనిచ్చి తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం సిద్దం. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2-3 లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారి చేయాలి. దీనిని ఆరునెలల వరకు నిల్వ ఉంచవచ్చు.ఈ విధంగానే సీతాఫలం, ఉమ్మెత్త, వివిధ ఆకులతో కషాయం తయారు చేయవచ్చు. ఈ కషాయం కాండంతొలుచు పురుగు, కాయతొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల నివారణకు పనిచేస్తుంది.
, , , , , , #ఉమ్మెత్త, #కషాయం, #కాండంతొలుచుపురుగు, #కాయతొలుచుపురుగు, #తెలుగురైతులు, #పల్లేరుఆకు, #పురుగులనివారణ, #బ్రహ్మాస్త్రం, #రైతులు, #వేపాకు, #వ్యవసాయం, #సహజపురుగులమందు, #సీతాఫలంఆకు, #సేంద్రీయపురుగులమందు, #సేంద్రీయవ్యవసాయం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

** ఔషధ మొక్క… మిరప ** --------------------------------మిరప వార్షిక లేదా తక్కువ కాలం బ్రతికే బహుళ వార్షిక మొక్క. పూలు తెల...
24/08/2026

** ఔషధ మొక్క… మిరప **
--------------------------------
మిరప వార్షిక లేదా తక్కువ కాలం బ్రతికే బహుళ వార్షిక మొక్క. పూలు తెలుపు రంగులో ఉంటాయి. కీటకాల ద్వారా లేదా స్వపరాగ సంపర్కం ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. కాయలు నిటారుగా, అండాకారంశంఖాకారం నుండి బల్లెం ఆకారంలో ఉంటాయి. అవి సాధారణంగా అతి చిన్నగా, అతి కారంగా ఉంటాయి. 10-20 మి.మీ. పొడవు పెరుగుతాయి. 3-7 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. కాయలు లేత పసుపు రంగుకి మారి పక్వదశలో కాంతివంతమైన ఎరుపు రంగుకి మారతాయి.

సాధారణ నామం : కూరమిరప శాస్త్రీయ నామం : క్యాప్సికం ఫ్రూటెసెన్స్ కుటుంబం: సొలనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

మిరప అనేక జీర్ణ సంబంధ సమస్యలయిన కడుపునొప్పి, జీర్ణకోశంలో గ్యాస్, డయేరియాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది హృదయ, రక్త సంబంధ సమస్యలకు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, గుండెజబ్బులు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
రక్తాన్ని పలుచన చేసి గుండెజబ్బుల రిస్క్‌ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
మిరపలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మిరపలో ఉన్న క్యాపెå్ససినాయిడ్స్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మిరప అనేక సమస్యలకు ఉపయోగపడే గొప్ప ఔషధ మొక్క.
మనుషులలో మలేరియా, బోదకాలు, డెంగు, జపనీస్ ఎన్‌సిఫలైటిస్ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమ యీడెస్ యీజెప్టీ రెండవ దశ లార్వాలను మిరప ఆకు, కాయ ద్రావణాలు సమర్ధవంతంగా చంపాయి (వినాయక, అతని అనుచరులు, 2010)

వ్యవసాయరంగంలో

మిరపకాయ ఇథనాల్ ద్రావణం (30%) మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలిస్ జియామెయిస్ పురుగుని వికర్షణ చర్య ద్వారా నివారించింది (అకిన్ బులుమ, అతని అనుచరులు, 2015).
మిరప ఆకు ద్రావణం వేరు శనగ నిల్వ సమయంలో నష్టం కలిగించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను 88.06% అరికట్టింది. కాయ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ నైగర్ శిలీంద్ర పెరుగుదలను 88.3% అరికట్టింది. మిరప కాయ ద్రావణంతో శుద్ధి చేసిన వేరుశనగ గింజలలో శిలీంద్రాల పెరుగుదల అధికంగా అరిక\్టబడింది. వేరుశనగ గింజలలో శిలీంద్రాలాశించడాన్ని అరికట్టడానికి మిరపకాయ ద్రావణం బాగా పనిచేస్తుందని ఫలితాలు వెల్లడించాయి (సౌమ్య, నాయర్, 2012).
మిరపకాయ ద్రావణం చెదపురుగులను (కాప్టోఎర్మెస్ గెస్ట్రాయ్) నివారించింది (కోలన్, అతని అనుచరులు, 2016).
మిరప కాయల ద్రావణం తయారు చేయడానికి 2 పిడికెళ్ళ మిరపకాయలను ఎండబెట్టి మెత్తని పొడి చేయాలి. ఈ పొడిని 2 లీ. నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టాలి.
మిరప విత్తన పొడి అలసంద, మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే బ్రూచిడ్స్, కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్, సైటోఫిలా జియామెయిస్ పురుగులను నివారించింది (ఓని, 2010).
మినుము గింజలను మిరపకాయ ద్రావణం (600 పిపియం)తో శుద్ధి చేసి కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్రూచిడ్‌ని 91% నివారించవచ్చు. (మొరాల్లోరీసస్, అతని అనుచరులు).
మిరప కాయ ద్రావణం క్యాబేజి పంటనాశించే పేనుబంక, బ్రెవికారినెబ్రాసికె, డైమండ్ బ్యాక్‌మాత్‌ని రసాయన పురుగుమందులతో సమానంగా నివారించింది (అమోనాబెంగ్, అతని అనుచరులు, 2013).
మిరప చీమలు, పేనుబంక, లార్వాలు, రైస్‌వీవిల్, అనేక బీటిల్స్ మొదలైన పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది. 300 గ్రా. మిరప కాయలను రోట్లో బాగా దంచి మెత్తని పొడి చేయాలి. దంచేటపుడు చేతులకు గ్లౌస్ తొడుక్కోవాలి. శరీరంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ పొడిని 2 లీ. నీటికి కలిపి 7 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత ఇంకొక 4 లీ. నీరు కలిపి పిడికెడు సబ్బు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి పిచికారి చేయాలి.
మిరప కాయలను ఎండలో ఆరబెట్టి దంచి పొడి చేయాలి. ఈ పొడి నిల్వ చేసిన ఉత్పత్తులనాశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది.
మిరప ద్రావణం వైరస్‌లను కూడా నివారిస్తుంది. అయితే ఈ ద్రావణాన్ని వైరస్ ఆశించక ముందు పంటపై పిచికారి చేయాలి (ప్లూక్, 1999).
పురుగులను నివారించే మిరప ఫార్ములేషన్లు

అన్ని పురుగుల నివారణ ద్రావణం (ఆర్గానిక్ గార్డెనింగ్, 1996)
కావలసిన పదార్థాలు : ఎండు మిరప పొడి 1 చెంచా; వెల్లుల్లి గడ్డ 1, చిన్న ఉల్లి గడ్డ 1, నీరు 1 లీటరు, సబ్బుపొడి 1 చెంచా, కత్తి 1, స్టెయినర్ (వడపోయడానికి) 1, బేసిన్ 1

తయారు చేసే విధానం : వెల్లుల్లి, ఉల్లి గడ్డలను తరగాలి. ఎండుమిరప కాయ పొడి కలపాలి. వీటన్నింటినీ నీటిలో కలిపి ఒక గంట నానబెట్టాలి. తర్వాత వడపోసి సబ్బు పొడి కలిపి బాగా కలపాలి. స్ప్రేయర్లో నింపి మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి.

నివారించబడే పురుగులు : ఆకులను తినే పురుగులు

మిరప కషాయం (హెచ్‌డిఆరఎ, 2000)
కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 4 కప్పులు, లేదా మిరప విత్తనాలు 5 కప్పులు, సబ్బుపొడి 30 గ్రా., మట్టి కుండ 1, స్టెయినర్ 1

తయారు చేసే విధానం : మట్టికుండలో ఎండు మిరపకాయలు లేదా మిరప విత్తనాలను నీటిలో కలిపి 15-20 ని. మరగబెట్టాలి. కుండని పొయ్యిమీద నుంచి దించి 3 లీ. నీరు కలపాలి. చల్లార్చి వడపోయాలి. సబ్బుపొడిని వేసి బాగా కలపాలి. తర్వాత పంటపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : చీమలు, పేనుబంక, లార్వాలు, దోమలు, పిండి నల్లులు.

మిరప వేప ఆకుల ద్రావణం (స్టోల్, 2000)
కావలసిన పదార్థాలు : పచ్చి మిరపకాయ ముక్కలు 10-20, తాజా వేప ఆకులు 2 -2.5 కి., నీరు 2 లీ., సబ్బుపొడి 2 చెంచాలు, రోలు, బండ 1, పాత్ర 1

తయారు చేసే విధానం : మిరపకాయ ముక్కలను, వేప ఆకులను దంచి ఒక లీటరు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడపోసి దీనికి 20 లీ. నీరు, సబ్బుపొడి కలపాలి. ఉదయం వేళల్లో గానీ, సాయంత్రం వేళల్లోగాని మొక్కలపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : లద్దె పురుగు, తెల్లదోమ, మొజాయిక్ వైరస్.

మిరప-వేపగింజల ద్రావణం (స్టోల్, 2000)
కావలసిన పదార్థాలు : కత్తిరించిన పండు మిరప కాయ ముక్కలు 12, పూర్తిగా ఎండిన తొక్కతీసిన వేప గింజలు 200 గ్రా., నీరు 2 లీ., పాత్ర/కుండ 1, గ్రైండర్ 1, కత్తి 1

తయారు చేసే విధానం : వేప గింజలను నూరి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పండు మిరప కాయ ముక్కలను కలిపి వడపోయాలి. స్ప్రేయర్‌లో నింపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

నివారించబడే పురుగులు : పేనుబంక, డైమండ్‌బ్యాక్‌మాత్, రసంపీల్చే పురుగులు, తెల్లదోమ

మిరప – సీతాఫలం – వేప ద్రావణం (శ్రీధర్, అతని అనుచరులు, 2002)

కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 25 గ్రా., సీతాఫలం ఆకులు 100 గ్రా., దంచిన వేపకాయలు 50 గ్రా., సబ్బు ద్రావణం 20 మి.లీ., గ్రైండర్ 1, వెడల్పు మూత సీసాలు, ప్రాత 1
తయారు చేసే పద్ధతి : ఎండుమిరప కాయలను నూరాలి. 100 మి.లీ. నీటిలో నానబెట్టాలి. నూరిన వేపకాయలను 200 మి.లీ. నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు రెండు ద్రావణాలను కలపాలి. సీతాఫలం ఆకులను నూరి 500 మి.లీ. నీరు కలపాలి. వడపోసి అన్ని ద్రావణాలను కలపాలి. దీనికి 5-6 లీ. నీరు కలపాలి. సబ్బు ద్రావణం పోసి బాగా కలిపి మొక్కలపై ఉదయం లేదా సాయంత్రం పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : పేనుబంక, ఆకుచుట్టు పురుగులు, ఎర్రపొలుసు పురుగులు, మచ్చల బీటిల్స్

క్యాబేజి పంటలో ఆశించే ప్లూటెల్లా క్జ్లైలోస్టెల్లా, బ్రెవికారిని బ్రాసికె, హెలుల్లా ఆండాలిస్, ట్రైకోఫ్లూసియా ని పురుగులపై మిరప, వెల్లుల్లి ప్రభావాలను రసాయన పురుగు మందు ‘అటాక’ తో పోల్చి చూశారు. ఈ ద్రావణాలు క్యాబేజి పంటపై పురుగులను 10.76% నుండి 55.94% నివారించాయి. రసాయన పురుగుమందు అటాక్ పిచికారి చేసిన మొక్కలకన్నా మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన మొక్కలలో సహజ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి. సస్యరక్షణ ఖర్చు అటాక్ పిచికారి చేసిన ప్లాటులో మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన ప్లాట్లలో కన్నా అధికంగా ఉంది (బయిడూ, మోచయ్య, 2015).
సేంద్రియ పురుగు మందులు రసాయన పురుగమందుల కన్నా సురక్షితమైనవి మరియు అధిక పర్యావరణహితమైనవి. వాతావరణ కాలుష్యం కలిగించే వ్యర్థాలలో ఒకటైన మానవ లేదా పశువుల మూత్రాన్ని సేంద్రియ పురుగు మందు తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. 100 లీ. మూత్రం {1 కి. సుగంధ ద్రవ్యాలను కలిపి సేంద్రియ పురుగు మందు తయారు చేస్తారు.
సేంద్రియ పురుగు మందు
కావలసిన పదార్థాలు : మానవ లేదా పశువుల మూత్రం 100 లీ., పసుపు, ఫిలెసెలోచి మంజారింగ, పార్కియాస్పీసియోసా , టైనోస్పోరాక్రిస్సా ఒక్కొక్కటి 250 గ్రా., మిరప, ఉల్లి 750 గ్రా., ఎంపిక చేసిన సుగంధ ద్రవ్యాలలో మొక్కలలో పురుగుల పెరుగుదలనరికట్టే లక్షణాలున్నాయి.

సేంద్రియ పురుగు మందు తయారు చేసేవిధానం

250 గ్రా. చొప్పున పసుపు, పిథకలోబియం జిరింగి, పార్కియా స్పీసియోసా, టినోస్పొరా క్రిస్పా లను నీటిలో 24 గంటలు నానబెట్టాలి.
తర్వాత వీటిని మరిగించాలి.
మూత్రాన్ని పెద్దగిన్నెలో పోసి మరగబెట్టిన సుగంధ ద్రవ్యాలను కలపాలి
మూత్రం, మరగబెట్టిన సుగంధ ద్రవ్యాలను 2-3 వారాలు పులియబెట్టాలి.
750 గ్రా. పండుమిరప, ఎర్రుల్లి ముక్కలను పులిసిన మిశ్రమానికి కలిపి గిన్నెని 34 రోజులు మూసి ఉంచాలి
సేంద్రియ పురుగుమందు ఉపయోగించడానికి సిద్ధం
1 లీ. సేంద్రియ పురుగు మందుని 10 లీ. నీటిలో కలపాలి (రొజాక్, సోఫ్రియాని, 2009)
మిరప ఆకు ద్రావణం (5 మి.గ్రా. / మి.లీ.) ఆల్టర్నేరియా (75%), కొల్లెటోట్రైకం (12.5%), ఫ్యుజేరియం (17.5%) శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది (దేవ్, వేణు, 2016).
మిరప పొడి, మిరియాల పొడి గోధుమ ధాన్యాన్ని నిల్వలో ఆశించే రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ గ్రానరీస్ పురుగుల నుండి కాపాడే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (అఫౌరి, షాయేస్టే, 2010).
మునగ ఆకులు, మిరపకాయలను నూరి ద్రావణాలు తయారు చేయాలి. ఈ రెండు ద్రావణాలను కలిపి 5-7 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత పురుగుల నివారణకు పంటపై పిచికారి చేయాలి.
మిరప కాయల ద్రావణం, ఎమామెక్టిన్ బెంజొయేట్ (ఎటాక్) క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్ (ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, పేనుబంక (బైవికారినె బ్రాసికె), తెల్లదోమ (బెమిసియా టబాసి)ను, ఫ్రెంచి చిక్కుడు నాశించే ఫ్లవర్ త్రిప్స్ (మెగాల్యూరోత్రిప్స్ జోస్టెడ్రి), తెల్లదోమ (బెమిసియా టబాసి), దీపపు పురుగులు (ఎంపోవాస్కా స్పీసీస్) అలసంద పేనుబంక (ఎఫిస్ క్రాకివొరా)లను సమర్ధవంతంగా నివారించాయి. క్యాబేజి పంటలో సహజ శత్రువులు కొటేసియా ప్లుటెల్లా, అక్షింతల పురుగు, కెలోమెనెస్ స్పీసీస్, హోవరఈగ, సాలీళ్ళు, ఫ్రెంచి చిక్కుడులో అక్షింతల పురుగులు, సాలీళ్ళకు హాని కలిగించకుండా సంరక్షించాయి (అడమ, టెగ్బె, 2014).
మిరప పొడి (5 గ్రా.), మిరప పొడి { మెత్తని ఇసుక (5 గ్రా.) చొప్పున ప్రతి జొన్న మొక్క మొగిలో 10 రోజుల వ్యవధిలో 4 సార్లు వేసి జొన్నలో కాండం తొలుచు పురుగును నివారించారు (ఒక్రికట, అతని అనుచరులు, 2016)
మిరప ద్రావణం (100%), 80% మిరప ద్రావణం { 20% మేక ఎరువు టీ శనగపచ్చ పురుగు లార్వాలను చంపాయి (ల్యూటాప్, అతని అనుచరులు, టెక్నికల్ ప్రాజక్ట్ రిపోర్టు)
ఉగాండాలోని విక్టోరియా బేసిన్‌లో రైతులు మిరప ద్రావణాలను సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు (మికిండి, అతని అనుచరలు, 2015)
కిలో వరి ధాన్యానికి 10-20 గ్రా. మిరప పొడి చొప్పున కలిపి ధాన్యాన్ని ఆశించి నష్టపరిచే పురుగులను నివారించవచ్చు.
మిరప, వెల్లుల్లి ద్రావణాలకు టమాట పంటనాశించే ఎర్రనల్లి (టెట్రానైకస్ ఎవాన్సి)ని నివారించే శక్తి ఉంది (ఫాతిమా, ఆమె అనుచరులు, 2015).
మిరప ద్రావణాన్ని నేరుగా వ్యవసాయ పంటలలో పిచికారి చేసి బీటిల్స్, పేనుబంక, నల్లి, చిత్త పురుగులు, క్యాబేజి సీడ్‌పాడ్ వీవిల్స్, చారల కుకుంబర్ బీటిల్, మచ్చల కుకుంబర్ బీటిల్, కొలరాడోపొటాటో బీటిల్, డైమండ్ బ్యాక్‌మాత్, మొక్కజొన్న కండె తొలుచు పురుగు, తెల్లదోమ, ఇంపోర్టెడ్ క్యాబేజివర్మ్, క్యాబేజి మాగట్, ఆనియన్ మాగట్, కాటన్ బోల్‌వర్మ్ పురుగులను నివారించవచ్చు.
నిల్వ ఉంచిన అలసంద గింజల నాశించే అలసంద వీవిల్ కాల్లసో బ్రూకస్ మాక్యులేటస్‌ని మిరప, వెల్లుల్లి పొడి, ద్రావణాలతో నివారించవచ్చు (వహేది, అతని అనుచరులు, 2014).
మిరపలో ఉండే ఆల్కలాయిడ్లు క్యాబేజి నాశించే పేనుబంక, బ్రెవికారినె బ్రాసికే ని 100% నివారించాయి (హబియన, హకిజయేజు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

, , , , , , , , , , , , #ఔషధమొక్క, #ఔషధమొక్కలు, #కూరమిరప, #పంటరక్షణ, #పురుగుమందు, #పురుగులనివారణ, #ప్రకృతివ్యవసాయం, #మిరప, #మిరపకాయ, #మిరపద్రావణం, #మిరపవేపద్రావణం, #రైతులు, #రైతుసమాచారం, #వేపద్రావణం, #వ్యవసాయం, #వ్యవసాయచిట్కాలు, #సస్యరక్షణ, #సహజపురుగుమందు, #సహజవ్యవసాయం, #సేంద్రియపురుగుమందు, #సేంద్రియపురుగులనివారణ, #సేంద్రియవ్యవసాయం, #సేంద్రీయవ్యవసాయం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

24/08/2026

FULL VIDEO LINK 👉👉👉 : https://youtu.be/IrNXXF4vKhE
------------------------------------------------------------------------


వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామానికి చెందిన కొండారెడ్డి గారు వ్యవసాయంలో విభిన్నంగా సాగుతూ... మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పంటలను విభాగాలుగా సాగు చేస్తూ మంచి దిగుబడులు అందుకుంటున్నారు. ఆ వివరాలను ఇలా తెలియజేశారు.

ఈరోజు రైతు నేస్తం ఫౌండేషన్ లోని (ఆకాష్ చౌరాసియా మోడల్ ) పందిరి సాగులో నేను… ఈ ఖరీఫ్ లో నిన్న రాత్రి కురిసిన వర్షం వలన రై...
23/08/2026

ఈరోజు రైతు నేస్తం ఫౌండేషన్ లోని (ఆకాష్ చౌరాసియా మోడల్ ) పందిరి సాగులో నేను… ఈ ఖరీఫ్ లో నిన్న రాత్రి కురిసిన వర్షం వలన రైతులకు చాలా ఉపయోగం కలిగింది… ఎలినినో ప్రభావం వలన ఈ సీజన్లో వర్షం లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది కొద్దిగా ఉపశమనం కావచ్చు..

23/08/2026

FULL VIDEO LINK👉👉👉 : https://youtu.be/oEphloBw1j0
----------------------------------------------------------------------
పాత గుంటూరుకు చెందిన జ్యోత్స్న గుడివాడ ... తమ ఇంట్లో మొక్కల ప్రపంచాన్ని సృష్టించారు. కూరగాయలు, ఆకు కూరలే కాకుండా అంతరించిపోతున్న అరుదైన మొక్కలను కూడా పెంచుతూ ఇంటినే ప్రకృతి వనంలా మార్చేశారు. విభిన్న పూలు, ఆకర్షణీయమైన అలంకరణ మొక్కలతో తమ కలల సౌధాన్ని నందనవనంలా తీర్చిదిద్దారు. ఇంట్లో పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించి, పచ్చదనం పెంచాలనే సంకల్పంతోనే తమ గార్డెన్ ని ఇలా తయారు చేశామని, కుటుంబం అంతా కలిసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతున్నామని జ్యోత్స్న వివరించారు.
, , , , , , , , , , , , , , , , , , ,

** అగ్నాస్త్రం ** -----------------కాండం తొలుచు, కాయ తొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల కొరకు ఈ అగ్నాస్త్రం ఉపయోగిస్త...
22/08/2026

** అగ్నాస్త్రం **
-----------------
కాండం తొలుచు, కాయ తొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల కొరకు ఈ అగ్నాస్త్రం ఉపయోగిస్తారు.
తయారీ విధానం: ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని ఇందులో 1 కిలో పొగాకు ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్ద, 1 లేదా 2 కిలోల పచ్చి మిరపకాయల ముద్ద మరియు 1/2 కిలో వెల్లుల్లి ముద్ద వేసి పాత్రపైన మూత పెట్టి 4 సార్లు పొంగు వచ్చేటట్లుగా బాగా ఉడికించాలి. తర్వాత పాత్రను కిందకి దించి 48 గంటల వరకు చల్లారనివ్వాలి. చివరకు ఒక గుడ్డతో వడగట్టి ఒక డబ్బాలో పోసి ఉంచాలి. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2 Ð 3 లీటర్ల అగ్నా¢స్తం కలిపి పిచికారీ చేయండి.

, , , , , , , , , , #అగ్నాస్త్రం, #తొలుచుపురుగులు, #పురుగులనివారణ, #ప్రకృతివ్యవసాయం, #సహజవ్యవసాయం, #సేంద్రీయవ్యవసాయం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్

** బయోచార్ తయారీ విధానము, సలహాలకు సంప్రదించ వలసిన సంస్థలు ** -----------------------------------------------------------...
22/08/2026

** బయోచార్ తయారీ విధానము, సలహాలకు సంప్రదించ వలసిన సంస్థలు **
---------------------------------------------------------------------------
బయోచార్ తయారీ విధానము, సంప్రదించవలసిన సంస్థ

డ్రమ్ పద్ధతి: డా కే. నటరాజ్, వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్. Ph: 7659804499
గొయ్యి పద్ధతి: డా. ఎమ్. ఏ. ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం), విశ్రాంత ఆచార్యులు,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, డైరెక్టర్ (అకాడమిక్స్), ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటి, హైదరాబాద్. చరవాణి : 9701876662)
ఇటుకల కిల్న్ పద్ధతి: ICAR-IARI (భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ), ICAR-CRIDA (కేంద్ర వర్షాధార వ్యవసాయ పరిశోధనా సంస్థ)
కాన్-టికీ బయోచార్ కిల్న్: అనిల్ కుమార్, శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్, దండు మల్కాపూర్, హైదరాబాద్. Ph: 9848092288, 8047637695
ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్: డా. రాజేష్ పసుమర్తి, శాస్త్రవేత, అంతర్జాతీయ అర్ధశుష్క ఉష్ణమండల పంటల పరిశోధనా సంస్థ (ICRISAT). ఫోన్:40-30713296
భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్: ICAR-CIAE (కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ), భోపాల్, మధ్య ప్రదేశ్. Ph: 7552734731.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

** ఔషధ మొక్క… బంగ్లా ఆకు / గాంజా ** ---------------------------------------------గాంజా ఒక వార్షిక, 6-12 అ. ఎత్తు పెరిగే ...
22/08/2026

** ఔషధ మొక్క… బంగ్లా ఆకు / గాంజా **
---------------------------------------------
గాంజా ఒక వార్షిక, 6-12 అ. ఎత్తు పెరిగే పూలు పూసే హెర్బల్ మొక్క. కాండం నిటారుగా పెరుగుతుంది. పెద్ద ఆకులు ఎగుడుదిగుడు అంచులు కల చిన్న ఆకులను కలిగి ఉంటాయి. మొదటి జత ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రమంగా ఈ చిన్న ఆకుల సంఖ్య 7 లేదా 9 వరకు పెరుగుతుంది. మొక్క చివరలో ఏర్పడే ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రింది జత ఆకులు ఎదురెదురుగా ఏర్పడతాయి. మొక్క చివరి భాగంలోని జంట ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ప్రతి మొక్కలో ఆడ, మగ పూలు ఏర్పడతాయి.

సాధారణ నామం : మార్జువానా / భంగ్‌మొక్క / కామన్ హెంప్ శాస్త్రీయ నామం : కెన్నాబిస్‌సెటైవా కుటుంబం: కెన్నాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

వేలాది సంవత్సరాలుగా ఔషధరంగంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, డయేరియా, డిసెంట్రి, గనోరియ, ఎపిలెప్సి, గౌట్, మలేరియా, జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
గౌట్, వ్రణాలు, వెర్రుకోస్‌వెయిన్, కీళ్ళ నొప్పులకు లేపనంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులలో నాసియా, వామిటింగ్‌ల నుండి ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయరంగంలో

గాంజా మొక్కను పురుగు వికర్షిణి, కీటకనాశినిగా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పురుగులు, నులి పురుగులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలను ఆటంక పరుచుటకు దీనిని సహచర పంటగా నాటుతారు. (లేడీస్టోన్, 2015)
గాంజా మొక్క ఎండబెట్టిన ఆకులు, పూలు పురుగులు, నల్లులు, నులిపురుగులు కలుపు మొక్కలను వికర్షిస్తాయి లేదా చంపుతాయి. మొక్కల ద్రావణాలు పురుగులు, నులిపురుగులు, నల్లులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలు, బాక్టీరియా, ప్రోటోజోవాలను వికర్షించడం లేదా చంపడం చేస్తాయి. (మెక్‌పార్ట్‌లాండ్, 1997)
ప్రత్తి చేలకు దగ్గరలో గాంజా మొక్కలను పెంచితే ప్రత్తి నాశించే అలబామా ఆర్ౙిల్లేసియా (కాటన్ వర్మ్) నుండి రక్షించింది (రిలే, 1885).
కూరగాయల పంటల చుట్టూ దీనిని పెంచితే క్యాబేజి లార్వా పియరిస్ బ్రాసికె క్యాబేజి పంటను ఆశించకుండా కాపాడింది (బెలింగ్, 1932).
ఆలుగడ్డ క్షేత్రాలు పొటాటో బీటిల్ (లెప్టినొటార్సా డెసెమ్‌లినియేటా) ఆశించకుండా రక్షింపబడ్డాయి (స్టాట్టి, 1976).
గోధుమ, వేరుశనగ లను డెలియాకోయార్ట్కేటా నుండి కాపాడతాయి. (పకోమోవ్ అండ్ పోటుషాన్ స్కీ, 1977),
గాంజా వేరు రసాలు భూమిలోని వేర్లకు నష్టం కలిగించే యూరోపియన్ చాఫర్ బీటిల్ (మెలోలోంతా మెలోలోంతా) నుండి కాపాడతాయి (మటీవ, 1995).
గాంజా చిక్‌వీడ్, స్టెల్లేరియా మీడియా, పెరుగుదలను అణచివేసింది (స్టుప్నికా రోడ్ౙింకీవిక్ౙ్, 1970).
పొటాటోలేట్‌బ్లెåట్ శిలీంద్రం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్ ను అరికట్టడానికి ఆలుగడ్డ పంటలో గాంజాని అంతర పంటగా వేయాలి (ఇస్రాయెల్, 1981).
ఆలుగడ్డ పంటని గాంజాతో పంట మార్పిడి చేసి పొటాటోసిస్ట్ నెమటోడ్, హిటరోడెరారోస్టోకైనెన్సిస్‌ని అణచి వేయవచ్చు. (కిర్‌యనోవా అండ్ క్రిల్, 1971).
గాంజాతో పంట మార్పిడి రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ చిట్‌వుడి, సంఖ్యని కూడా అణచి వేసింది (కోక్, అతని అనుచరులు, 1994).
బటన్ పుట్టగొడుగు (అగారికస్) పెంపకంలో 137 కి. కంపోస్టుకి 3 కి. గాంజా ఎండు ఆకులను కలిపి ఉపయోగిస్తే పుట్టగొడుగులను తినే నెమటోడ్, ఎఫెలెంకాయిడెస్ కాంపోస్టికోలాని అరికట్టబడింది. (గ్రెవాల్, 1989).
గాంజా విత్తన చెక్కలను భూమిలో వేస్తే మెలాయిడోగైన్ ఇన్‌కాంగ్నిటా నులి పురుగుల సంఖ్య తగ్గుతుంది (గోస్వామి & విజయలక్ష్మి, 1986)
ఎండు ఆకులు నిల్వ ధాన్యంలో ఆశించే ముక్కు పురుగులను వికర్షించాయి (రిలే Ê హోవార్డ్, 1892, మాకిండూ & స్టీవర్స్, 1924).
ఆలుగడ్డ కుప్పలపై 2 సెం.మీ. మందంలో ఎండిన, పొడి చేసిన ఆకుల పొరనేర్పాటు చేస్తే పొటాటో ట్యూబర్‌మాత్ ఆశించకుండా 120 రోజుల వరకు కాపాడుకోవచ్చు. (కష్యప్, అతని అనుచరులు, 1992).
గోధుమ గింజలకు పొడి చేసిన గాంజా ఆకులను కలిపి ముక్కు పురుగు సైటోఫిలాఒరైజే ఆశించకుండా కాపాడవచ్చు. (ఖరె, అతని అనుసచరులు, 1974).
పూలు పూసే గాంజ మొక్కను నీటిలో వేసి మరగించి కషాయం తయారు చేసి ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి పొటాటో బీటిల్, లెప్టినోటార్సాడెసెమ్ లినియేటని చంపవచ్చు. (స్ట్రాట్టి, 1976).
100 గ్రా. తాజా గాంజా ఆకులను 25 మి.లీ. నీటిలో కలిపి రుబ్బి, గుడ్డతో వడకట్టిన ద్రావణం 12వ దశ హిటరోడెరా కజాని నులిపురుగులను చంపాయి (మజుందార్, అతని అనుచరులు, 1989).
10 గ్రా. గాంజా ఆకులను 100 మి.లీ. నీటిలో రుబ్బి, పిల్టర్ పేపర్‌తో వడపోసి ద్రావణాన్ని తయారు చేశారు. 40% ద్రావణం రాగి విత్తనాల నాశించిన 25 వివిధ జాతులకు చెందిన శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, క్లాడోస్పోరియం, డ్రెష్లెరా, ఫ్యుజేరియం, సెఫలోస్పోరియం, రైజోపస్, మ్యూకార్, కర్వులేరియా (పాండే, 1982).
గాంజా ద్రావణం పైన్ నారు మొక్కలను ఫ్యుజేరియం కలిగించే తెగులు నుండి కాపాడింది (వైసోట్స్‌క్యి, 1962)
సోవియట్ అగ్రానమిస్టులు ‘కాన్‌సాటిన్ 4” లేదా కొన్సాటిన” అనే నీటిలో కలిపిన ద్రావణాన్ని ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి తెగుళ్ళు కలిగించే కొరినోబాక్టీరియం, సూడోమోనాస్, అగ్రోబాక్టీరియా స్పీసీస్‌ని నివారించారు. (జెలెపుకా, 1960, బెల్‌ట్యుకోవ, 1962).
ఆలుగడ్డ నిల్వ సమయంలో మెత్తని కుళ్ళు కలిగించే ఎర్వినియా కెరటవోరా మరియు ఇతర బాక్టీరియాలు నివారించబడ్డాయి (విజయ్, అతని అనుచరులు, 1992)
శ్రీవాస్తవ & దాస్ (1974) 100 గ్రా. నూరిన గాంజా ఆకులు, కాండాలను 10 మి.లీ. నీటిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగించి కషాయం తయారు చేశారు. ఈ కషాయం సైపరస్ రొటండస్ కలుపు మొక్క విత్తనాలను మొలకెత్తకుండా చేసింది.
గాంజా నీటి ద్రావణాలు ఫాల్స్‌ఫామోమైల్ (మాట్రికేరియా రెకుటియేటా), లెమన్ గడ్డి (లోపిడియం సెటైవా) కలుపు మొక్కల విత్తనాలను మొలకెత్తకుండా చేసాయి (స్టుప్నికరోడ్ౙింకి విక్ౙ్, 1970).
గాంజా ఆకు ద్రావణాలు (1,2 3, 10 మి.గ్రా/మి.లీ.) ఆపిల్ పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే కాడ్లింగ్‌మాత్ (సైడియాపోయోనెల్లా) ఆపిల్ కాయల నాశించకుండా నివారించింది. (డుర్డెన్, అతని అనుచరులు, 2011).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , #గాంజా, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

Address

6-2-959, Dakshin Bharat Hinid Prachara Sabha Complex, Khairtabad, Hyderabad
Telangana
500004

Alerts

Be the first to know and let us send you an email when RaituNestham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RaituNestham:

Shortcuts

Share