రామడుగు

రామడుగు నిజాలను నిర్భయంగా చర్చిద్ధాం....

04/03/2023

గ్యాస్ ధరలు పెంచాల్సిందే.. పెంచేంతవరకు నిరసన ఆగదు.. అవసరమైతే ఢిల్లీ కైనా పోదాం: ఎమ్మేల్యే గొంగిడి సునీత

మంచిర్యాల నుండి రామడుగు మండల తహసీల్దార్ గా బదిలీపై నేడు బాధ్యతలు స్వీకరించిన  #సాయిబాబా గారికి ఘన స్వాగతం.
20/10/2018

మంచిర్యాల నుండి రామడుగు మండల తహసీల్దార్ గా బదిలీపై నేడు బాధ్యతలు స్వీకరించిన #సాయిబాబా గారికి ఘన స్వాగతం.

కరీంనగర్ జిల్లాకు రామడుగు మండలం కేవలం 6కిలోమీటర్ల దూరం మరియు మండలకేంద్రం 19కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా 40కిలోమీటర్ల దూ...
08/06/2016

కరీంనగర్ జిల్లాకు రామడుగు మండలం కేవలం 6కిలోమీటర్ల దూరం మరియు మండలకేంద్రం 19కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా 40కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లలో రామడుగు మండలాన్ని విలీనం చేయడం ద్వారా రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా దగ్గరున్న జిల్లాకు ప్రజలు దూరం అవుతున్నారు. ఇలాంటి అవగాహన లేని కార్యాచరణ కేవలం మంత్రి కేటీఆర్ కోసమే అన్నట్లుగా ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ నేడు రామడుగు మండల కేంద్రంలో గ్రామ ప్రజలు నిరసనలో భాగంగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించిన దృశ్యాలు.
సేకరణ : రామడుగు మిత్రులనుండి.....

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
01/05/2016

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

ABOUT KARIMNAGAR:District Name: KarimnagarState: TelanganaRegion: DeccanCountry: IndiaPin: 505001 more Tele Code: +91 08...
17/04/2016

ABOUT KARIMNAGAR:

District Name: Karimnagar
State: Telangana
Region: Deccan
Country: India
Pin: 505001 more
Tele Code: +91 0878
Vehicle Code: TS 02
Languages:Telugu Urdu Hindi
AREA: 11,823 Sq kms
Population: 38,11,738
Jana Sandrata: 307
Female: Male (East: Nishpathi)
1000 : 998
Population Increase: 58.00%
Literacy: 84%
SC Population: 7,00,000 plus
ST Population: 1,00,000 plus MP

CONSTITUENCIES : 2
Karimnagar
Peddapally

MLA CONSTITUENCIES: 13
Karimnagar
Choppadandi Jagtial
Dharmapuri
Korutla
Siricilla
Vemulawada
Ramagundam Manthani
Peddapally
Manakondur
Husnabad
Huzurabad

MUNCIPALITIES: 4
Jagtial
Korutla
Metpally
Siricilla

CORPORATION: 2
Karimnagar
Ramagundam

Nagara Panchayats: 5
Peddapally
Husnabad
Huzurabad
Jammikunta
Vemulawada

TOWNS:
Karimnagar City
Choppadandi
Jagtial
Dharmapuri Korutla
Siricilla
Vemulawada
Ramagundam
Manthani
Peddapally
Husnabad
Huzurabad
Sultanabad
Godavarikhani
NTPC

B,ed Colleges: 20
Schools: 2905
High Schools: 819
Banks: 169
Rain: 153 m.m
Forest: 2.52 Lakhs Hectors
Mandals: 57 Main Towns: 3
Villages: 1200 plus
Grampanchayats: 1207
Small Scale Industries: 4616
Heavy Middle Scale Industries: 11
Saagu Bhoomi: 50.2 Lakhs Hectors Hospitals: 71
Post Office: 252

Revenue Divisions: 3
Karimnagar
Peddapally
Jagtial

RIVERS: 2
Godavari
Manair

CROPS:
Vari
Jonna Mokka Jonna
VeruShenaga
Pesalu
Mirapa
Ulavalu
Nuvvulu

Khanijamulu:
iron
Sunnapurai
Sopurai

INDUSTRIES:
Tollu
Unni

TOURIST PLACES:
Vemulawada
RajaRajeswara Swamy Temple
Dharmapuri
Laxmi narasimha Swamy temple Kaleshwaram
TrilingaKshetram
Muktheshwaralayam
Ramagundam
NTPC
Power Dharmal Corporation Manthani
Manair Dam
Deerpark
Ramagirikilla
Sriramsagar Project
Kondagattu Anjaneya Swamy Temple

BOUNDARIES:
East: Adilabad
West: Nizamabad
North: Adilabad
South: Warangal
NOTABLE PERSONS:
P. V. Narasimha Rao, Former Prime
Minister of India.
Dr. C. Narayana Reddy, writer, Jnanpith
Award recipient.
Justice N. Kumarayya , Retired Chief Justice of Andhra Pradesh & ex-
judge,
World Bank Administrative Tribunal
Midde Ramulu (Oggu Katha artist from
Hanmajipet village)
Anabheri Prabhakar Rao - Telangana rebellion revolutionary and freedom
fighter
Mallojula Koteswara Rao
G. Ram Reddy, architect of distance
education and the father of open
learning in India.
Paidi Jairaj, film actor, director and
producer. He was recipient of Dadasaheb
Phalke Award for lifetime achievement
in 1980.
Siva Reddy , popular Telugu
comedian and actor...

పోటీ పరీక్షల కోసంగణాంకాల్లో తెలంగాణరాష్ట్ర సంక్షిప్త సమాచారంరాష్ట్రంలో వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగా...
14/04/2016

పోటీ పరీక్షల కోసం
గణాంకాల్లో తెలంగాణ

రాష్ట్ర సంక్షిప్త సమాచారం

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యం ఉంటున్నది. తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పారిశ్రామిక, సేవా తదితర రంగాలపై లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రచురితమైన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేల్లోని అంశాలపై ఉద్యోగార్థులకు సమగ్ర అవగాహ ఉండాలి. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం వివిధ అంశాలకు సంబంధించిన తెలంగాణ సంక్షిప్త సమాచారాన్ని అందిస్తున్నాం..

-తెలంగాణ విస్తీర్ణం - 1,12,077 చ.కి.మీ
-విస్తీర్ణపరంగా దేశంలో 12వ పెద్ద రాష్ట్రం.
-దేశంలో రాష్ట్ర విస్తీర్ణం - 3.40 శాతం
-పెద్ద జిల్లా - మహబూబ్‌నగర్
-చిన్న జిల్లా - హైదరాబాద్
-తెలంగాణ జనాభా - 3,50,03,674
-పురుషులు - 1,76,11,633
-మహిళలు - 1,73,92,041
-జనాభాపరంగా దేశంలో తెలంగాణది 12 స్థానం.
-దేశ జనాభాలో రాష్ట్ర జనాభా - 2.89 శాతం
-అత్యధిక జనాభాగల జిల్లా - రంగారెడ్డి (52,96,741)
-అత్యల్ప జనాభాగల జిల్లా - నిజామాబాద్ (25,51,335)
-2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల - 13.58 శాతం
-2001-11 మధ్య జాతీయస్థాయిలో జనాభా పెరుగుదల - 17.7 శాతం
-1991 - 2001 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల - 18.77 శాతం

గ్రామీణ జనాభా
-తెలంగాణలో గ్రామీణ జనాభా - 2,13,95,009
-గ్రామీణ జనాభా శాతం- 61.12 శాతం
-అత్యధిక గ్రామీణ జనాభాగల జిల్లా - మహబూబ్‌నగర్
-అత్యల్ప గ్రామీణ జనాభాగల జిల్లా - హైదరాబాద్

పట్టణ జనాభా
-రాష్ట్రంలో పట్టణ జనాభా - 1,36,08,665
-రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం - 38.88
-2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల - 38.12 శాతం
-1991-2001 మధ్య పట్టణ జనాభా పెరుగుదల - 25.13 శాతం
-అత్యధిక పట్టణ జనాభాగల జిల్లా - హైదరాబాద్
-అత్యల్ప పట్టణ జనాభాగల జిల్లా - నిజామాబాద్

రాష్ట్రంలో జిల్లాలు - 10
-మొత్తం పట్టణాలు - 158
-రెవెన్యూ డివిజన్లు - 42
-మున్సిపల్ కార్పొరేషన్లు - 6
-మున్సిపాలిటీలు - 37
-నగర పంచాయతీలు - 25
-జిల్లా పరిషత్‌లు - 9
-మండల ప్రజా పరిషత్‌లు - 438
-అత్యధిక మండలాలుగల జిల్లా - మహబూబ్‌నగర్ (64)
-అత్యల్ప మండలాలుగల జిల్లా - హైదరాబాద్ (16)
-గ్రామ పంచాయతీలు - 8,687

-అత్యధిక గ్రామ పంచాయతీలుగల జిల్లా - మహబూబ్‌నగర్ (1331)
-అత్యల్ప గ్రామ పంచాయతీలుగల జిల్లా - ఖమ్మం (671)
-రెవెన్యూ మండలాలు - 459
-రెవెన్యూ గ్రామాలు - 10,434
-ఎంపీటీసీలు - 6,456
-జడ్పీటీసీలు - 438
--ఎమ్మెల్యేలు - 119+1
-119 మంది ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ఒకరిని గవర్నర్ నియమిస్తారు.
-అత్యధిక ఎమ్మెల్యే స్థానాలుగల జిల్లా - హైదరాబాద్ (15)
-అతి తక్కువ ఎమ్మెల్యే స్థానాలుగల జిల్లా - నిజామాబాద్ (9)
-ఎమ్మెల్సీలు - 40
-ఎంపీలు - 17
-అత్యధిక ఎంపీ స్థానాలుగల జిల్లా - హైదరాబాద్ (3)

అక్షరాస్యత
-మొత్తం అక్షరాస్యులు - 2,60,96,778 (66.54 శాతం)
-పురుషుల్లో అక్షరాస్యత - 75.04 శాతం
-స్త్రీలల్లో అక్షరాస్యత - 57.99 శాతం
-పట్టణాల్లో అక్షరాస్యత - 81.09 శాతం
-గ్రామాల్లో అక్షరాస్యత - 57.30 శాతం
-అత్యధిక అక్షరాస్యతగల జిల్లా - హైదరాబాద్ (83.25 శాతం)
-అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా - మహబూబ్‌నగర్ (55.04 శాతం)
-స్త్రీ, పురుష నిష్పత్తి - 1000:988
-అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి - నిజామాబాద్ (1040). ప్రతి 1000 మంది పురుషులకు 1040 మంది స్త్రీలు.
-అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి - హైదరాబాద్ (954). ప్రతి 1000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు.

జనసాంద్రత
-రాష్ట్ర జనసాంద్రత 312. అంటే ప్రతి చదరపు కిలోమీటర్‌కు 312 మంది జనం ఉన్నారు.
-అత్యధిక జనసాంద్రతగల జిల్లా - హైదరాబాద్ (ఒక చదరపు కిలోమీటర్‌కు 18,172 మంది)
-అత్యల్ప జనసాంద్రతగల జిల్లా - ఆదిలాబాద్ (ఒక చదరపు కిలోమీటర్‌కు 170 మంది)

ఎస్సీలు
-రాష్ట్రంలో 54,08,800 మంది ఎస్సీ జనాభా ఉంది.
-ఎస్సీ పురుషులు - 26,93,127
-ఎస్సీ మహిళలు - 27,15,673
-రాష్ట్ర జనాభాలో ఎస్సీలు - 15.45 శాతం
-అత్యధికంగా ఎస్సీలుగల జిల్లా - కరీంనగర్-7,09,757 (18.80 శాతం)

-అత్యల్పంగా ఎస్సీలుగల జిల్లా - హైదరాబాద్-2,47,927 (6.29 శాతం)
-ఎస్సీల్లో అక్షరాస్యులు - 28,53,371 (58.9 శాతం)
-ఎస్సీల్లో లింగ నిష్పత్తి - 1000:1008
-ఎస్సీల్లో అత్యధిక అక్షరాస్యతగల జిల్లా - హైదరాబాద్ (77.72 శాతం)
-ఎస్సీల్లో అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా - మహబూబ్‌నగర్

ఎస్టీలు
-రాష్ట్రంలో ఎస్టీ జనాభా 31,77,940
-ఎస్టీ పురుషులు - 16,07,656
-ఎస్టీ మహిళలు - 15,70,284
-రాష్ట్ర జనాభాలో ఎస్టీల శాతం - 9.08
-ఎస్టీల్లో స్త్రీ, పురుష నిష్పత్తి - 1000:977
-అత్యధిక ఎస్టీ జనాభాగల జిల్లా - ఖమ్మం-6,56,577 (25.18 శాతం)
-అత్యల్ప ఎస్టీ జనాభాగల జిల్లా - హైదరాబాద్-48,937 (1.24 శాతం)
-ఎస్టీల్లో అక్షరాస్యులు - 14,12,617 (49.51 శాతం)
-ఎస్టీల్లో అత్యధిక అక్షరాస్యతగల జిల్లా - హైదరాబాద్ (69.34 శాతం)
-ఎస్టీల్లో అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా - మహబూబ్‌నగర్ (42.29 శాతం)
-పట్టణాల్లో ఎస్సీలు - 13,36,557 (24.71 శాతం)
-పట్టణాల్లో ఎస్టీలు - 3,47,901 (10.95 శాతం)

వికలాంగులు
-రాష్ట్రంలో మొత్తం వికలాంగులు - 10,46,822
-రాష్ట్ర జనాభాలో వికలాంగుల శాతం - 2.97
-పురుషులు - 5,65,413
-మహిళలు - 4,81,409
-అత్యధిక వికలాంగులుగల జిల్లా - హైదరాబాద్ (1,77,909)
-అత్యల్ప వికలాంగులుగల జిల్లా - నిజామాబాద్ (65,943)

సమగ్ర కుటుంబ సర్వే
-సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
-సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తేదీ - 2014, ఆగస్టు 19
-సగటు కుటుంబం - 3.56 మంది
-అత్యధిక కుటుంబాలుగల జిల్లా - రంగారెడ్డి (16.56 లక్షలు)
-అత్యల్ప కుటుంబాలుగల జిల్లా - నిజామాబాద్ (6.97 లక్షలు)
-మొత్తం ఆవాసాలు - 1,00,78,599
-ఇల్లు లేని కుటుంబాలు - 83,969

-ఇల్లు లేని కుటుంబాలు ఎక్కువగాగల జిల్లా - రంగారెడ్డి (20,107)
-ఇల్లు లేని కుటుంబాలు తక్కువగాగల జిల్లా - ఖమ్మం (3,822)
-హిందూ, ముస్లిం మతాల్లో మహిళల కంటే పురుషులు అధికం.
-క్రిస్టియన్లలో మహిళలు అధికం.
-ముస్లింలు అత్యధికంగా హైదరాబాద్‌లో, అత్యల్పంగా ఖమ్మంలో ఉన్నారు.
-క్రైస్తవులు అత్యధికంగా హైదరాబాద్‌లో, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో ఉన్నారు.
-సిక్కులు అత్యధికంగా హైదరాబాద్‌లో, అత్యల్పంగా ఖమ్మంలో ఉన్నారు.
-బౌద్దులు అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్.

శ్రామికులు
-ప్రధాన శ్రామికులు - 1,37,19,871 (39.19 శాతం)
-ఉపాంత శ్రామికులు - 26,22,063 (7.49 శాతం)
-రైతులు - 29,94,215 (21.82 శాతం)
-వ్యవసాయ కూలీలు - 45,89,751 (33.45 శాతం)

రహదారులు (2013-14)
-మొత్తం రోడ్లు - 90,800 కి.మీ.
-అత్యధిక రహదారులుగల జిల్లా - మహబూబ్‌నగర్ (13,924.18 కి.మీ.)
-అత్యల్ప రహదారులుగల జిల్లా - హైదరాబాద్ (216 కి.మీ.)

పంచాయతీరాజ్ రోడ్లు
-మొత్తం పంచాయతీరాజ్ రోడ్లు - 70,201 కి.మీ.
-అత్యధిక పంచాయతీరాజ్ రోడ్లుగల జిల్లా - మహబూబ్‌నగర్ (10,380.81)
-అత్యల్ప పంచాయతీరాజ్ రోడ్లుగల జిల్లా - రంగారెడ్డి (4363.69 కి.మీ.)

రోడ్లు భవనాల శాఖ రోడ్లు
-రోడ్లు భవనాల శాఖ మొత్తం రోడ్లు - 24,244.64 కి.మీ.
-రోడ్లు భవనాల శాఖ రోడ్లు అధికంగాగల జిల్లా - మహబూబ్‌నగర్ (110.46 కి.మీ.)
-అత్యల్ప పంచాయతీరాజ్ రోడ్లుగల జిల్లా - హైదరాబాద్ (174.68 కి.మీ)

జాతీయ రహదారులు
-రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు - 2,592 కి.మీ.
-అత్యధిక జాతీయ రహదారులుగల జిల్లా - మహబూబ్‌నగర్ (433.33 కి.మీ.)
-అత్యల్ప జాతీయ రహదారులుగల జిల్లా - హైదరాబాద్ (41.32 కి.మీ.)

అడవులు (2014-15)
-రాష్ట్రంలో మొత్తం అడవుల విస్తీర్ణం - 27,292 చ.కి.మీ.
-రిజర్వ్‌డ్ అడవులు - 19,696 చ.కి.మీ.
-రక్షిత అడవులు - 6,953 చ.కి.మీ.
-మిగతా అడవులు - 624.30 చ.కి.మీ.
-అడవులు అత్యధికంగాగల జిల్లా - ఆదిలాబాద్ (7,232 చ.కి.మీ.)
-అడవులు అత్యల్పంగాగల జిల్లా - రంగారెడ్డి, హైదరాబాద్ (731 చ.కి.మీ.)

విద్యుత్ వినియోగం
-మొత్తం విద్యుత్ కనెక్షన్లు - 2.61 కోట్లు
-వినియోగం - 72,518 మిలియన్ యూనిట్లు

తలసరి విద్యుత్ వినియోగం
-అత్యధికం - మెదక్ (గంటకు 1439 కిలోవాట్లు)
-అత్యల్పం - ఖమ్మం (గంటకు 554 కిలోవాట్లు)

పాఠశాలలు
-రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు - 43,293
-మొత్తం ఉపాధ్యాయులు - 2,34,879

1-5 తరగతులు
-పాఠశాలలు - 25,331
-ఉపాధ్యాయులు - 84,084
-విద్యార్థులు - 32,46,785

6-10 తరగతులు
-పాఠశాలలు - 9,937
-ఉపాధ్యాయులు - 94,524
-విద్యార్థులు - 28,16,473

తెలంగాణలో భూ వినియోగం
-మొత్తం భూమి - 112.07 లక్షల హెక్టార్లు
-సాగు భూమి - 43.8 లక్షల హెక్టార్లు (39 శాతం)
-అటవీ ప్రాంతం - 25.4 లక్షల హెక్టార్లు (22.7 శాతం)
-ప్రస్తుత బీడు భూమి - 14 లక్షల హెక్టార్లు (12.5 శాతం)
-వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి - 8.8 లక్షల హెక్టార్లు (7.9 శాతం)
-ఇతర బీడు భూములు - 8.1 లక్షల హెక్టార్లు (7.2 శాతం)
-వ్యవసాయ యోగ్యంకాని భూమి - 6.1 లక్షల హెక్టార్లు (5.4 శాతం)
-పచ్చిక బయళ్లతో కూడిన భూమి - 3 లక్షల హెక్టార్లు (2.75 శాతం)
-వృథాగా ఉన్న సాగుభూమి - 1.8 లక్షల హెక్టార్లు (1.6 శాతం)
-చెట్లు చేమలతో ఉన్న భూమి - 1.1 లక్షల హెక్టార్లు (1 శాతం)

వృద్ధి రేటు
-2015-16 ముందస్తు అంచనాల ప్రకారం జాతీయ వృద్ధిరేటు 7.57, తెలంగాణ వృద్ధిరేటు 9.24.
-2014-15 మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం
-జాతీయ వృద్ధిరేటు 8.82
-తెలంగాణ వృద్ధిరేటు 9.24

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ప్రామాణిక ధరల్లో) (కోట్లలో)
-2014-15 (FRE-మొదటిసారి సవరించిన అంచనాలు) 5,22,001 (వృద్ధిరేటు 13.4 శాతం)
-2015-16 (AE-ముందస్తు అంచనాలు) 5,83,117 (వృద్ధిరేటు 11.7 శాతం)

వర్తమాన ధరల్లో (2011-12) కోట్లలో
-2014-15 (FRE) 4,29,001 (వృద్ధిరేటు 8.8 శాతం)
-భారతదేశంలో తెలంగాణ ఆర్థిక వాటా 4.1 శాతం (2015-16)
-జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో అనుబంధ రంగాల వాటా (స్థిరత్వ ధరల్లో)

ఆర్థిక సర్వే 2015-16
-వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం 13 శాతం
-గనులు, యంత్రాలు 4 శాతం
-తయారీ రంగం 15 శాతం
-విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా 2 శాతం
-నిర్మాణ రంగం 6 శాతం
-వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 13 శాతం
-రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్లు 8 శాతం
-ఆర్థిక సేవలు 7 శాతం
-స్థిరాస్తి రంగం, ఆవాసాలు, నైపుణ్యత సేవలు 20 శాతం
-ప్రభుత్వ పరిపాలన 4 శాతం
-ఇతర సేవలు 8 శాతం
-జీవీఏలో వివిధ రంగాల వాటా (స్థిరత్వ ధరల్లో) 2015-16
-వ్యవసాయ రంగం, అనుబంధ రంగం 17 శాతం
-పారిశ్రామిక రంగం 22.5 శాతం
-సేవారంగం 60.5 శాతం

2013-14 ప్రకారం రంగాలవారీగా ఉద్యోగాలు
వ్యవసాయం, అనుబంధం 55.6 శాతం
పారిశ్రామిక రంగం 17.8 శాతం
సేవల రంగం 26.6 శాతం

సగటు నిరుద్యోగిత
-తెలంగాణలో 2.7 శాతం
-గ్రామాల్లో 1.1 శాతం
-పట్టణాల్లో 6.6 శాతం

మానవ వనరులు
-గ్రామీణప్రాంతంలో మానవ వనరులు 75.7 శాతం
-పట్టణ ప్రాంతంలో మానవ వనరులు 51.8 శాతం
-అత్యధిక మానవ వనరులు గల జిల్లా కరీంనగర్

వివిధ రంగాల్లో ఉద్యోగులు (2013-14)
రంగం గ్రామీణ పట్టణ మొత్తం
సేవారంగం 12.9 62.3 26.6
పారిశ్రామిక 12.9 30.8 17.8
వ్యవసాయ, అనుబంధం 74.2 6.9 55.6

సేవారంగం వాటాలు (ప్రస్తుత ధరల్లో)
-వ్యాపారం, మరమ్మతలు, హోటళ్లు, రెస్టారెంటులు 18.9 శాతం
-రవాణా, నిల్వ, సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు 13.9 శాతం
-ఆర్థిక సేవలు 9.6 శాతం
-రియల్ ఎస్టేట్, వృత్తి సేవలు 18.6 శాతం
-ప్రజా పాలన 19.9 శాతం
-ఇతర సేవలు 17.1 శాతం
-దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 3,65,304
-అత్యధికం మహబూబ్‌నగర్ (55,080)
-అత్యల్పం హైదరాబాద్ (20,304)
-దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు 7,22,151
-అత్యధికం రంగారెడ్డి (1,09,700)
-అత్యల్పం ఆదిలాబాద్ (50,604)

పరిశ్రమలు
-మొత్తం పరిశ్రమలు 10,279
-మొత్తం ఉద్యోగులు 7,07,738
-నెట్ వ్యాల్యూ యాడెడ్ (కోట్లలో) 28,728
-గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ (కోట్లలో) 10,559
-విషయం అత్యధికం అత్యల్పం
-పరిశ్రమలు రంగారెడ్డి నిజామాబాద్
-ఉద్యోగులు రంగారెడ్డి ఖమ్మం
-గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (కోట్లలో) రంగారెడ్డి ఖమ్మం
-గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (కోట్లలో) రంగారెడ్డి నిజామాబాద్

మానవాభివృద్ధి సూచిక
-వర్థమానకాలంలో స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవాభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని అంచనావేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సగటు జీవితకాలం, శిశు మరణాలు, పేదరికం లాంటి జీవన ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకొని మానవాభివృద్ధి సూచీని రూపొందిస్తున్నాయి.
-ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (UNITED NATIONS DEVELOPMENT PROGRAMME- UNDP) తయారు చేసిన మొదటి మానవాభివృద్ధి రిపోర్ట్‌ను మహబూబ్-ఉల్-హక్ (పాకిస్థాన్) నాయకత్వంలో 1990లో రూపొందించారు. దేశంలో తొలిసారిగా HDIని రూపొందించిన రాష్ట్రం మధ్యప్రదేశ్.
-రాష్ట్ర తొలి మానవాభివృద్ధి సూచికను ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) రూపొందించింది.
-జిల్లాలు మానవాభివృద్ధి సూచికలో అభివృద్ధి (2004-11)

దవాఖానలు
-అలోపతి 206
-ప్రభుత్వ అలోపతి వైద్యులు 4,713
-అత్యధిక అలోపతి దవాఖానలు గల జిల్లా హైదరాబాద్ 36
-అత్యల్ప అలోపతి దవాఖానలు గల జిల్లా కరీంనగర్ 14
-మొత్తం పడకలు 20,450

సంప్రదాయ వైద్యం
-మొత్తం దవాఖానలు 11
-ఆయుర్వేదం 4
-యునానీ 3
-హోమియో 3
-ప్రకృతి వైద్యం 1
-దవాఖానల్లో మొత్తం పడకలు 717

ఆరేండ్లలోపు పిల్లలు
-రాష్ట్రంలో ఆరేండ్లలోపు పిల్లల సంఖ్య - 38,99,166
-బాలురు - 20,17,935
-బాలికలు - 18,81,231
-బాల, బాలికలు అత్యధికంగాగల జిల్లా - రంగారెడ్డి
-బాల, బాలికలు అత్యల్పంగా జిల్లా - ఖమ్మం
-బాల, బాలికల నిష్పత్తి - 1000:932
-బాల, బాలికల నిష్పత్తి అధికంగాగల జిల్లా - ఖమ్మం
-బాల, బాలికల నిష్పత్తి అత్యల్పంగాగల జిల్లా - హైదరాబాద్
-రాష్ట్ర జనాభాలో అరేండ్లలోపు పిల్లల శాతం - 11.14 శాతం
-దేశంలోని పిల్లల జనాభాలో రాష్ట్ర పిల్లల జనాభా శాతం - 2.37 శాతం

రామడుగు మండల తహసీల్దారు గా ఎ. అండాళ్ నిన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరు వరంగల్ జిల్లా నుండి బదిలీపై వచ్చారు.
12/04/2016

రామడుగు మండల తహసీల్దారు గా ఎ. అండాళ్ నిన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరు వరంగల్ జిల్లా నుండి బదిలీపై వచ్చారు.

ఒకరు రామడుగు గ్రామంలో వందలమందికి విద్యా బుద్ధులు నేర్పిన గుడిబడి మాస్టారు నిరంజన్ సార్, మరొకరు అదే గ్రామంలో నవత డిష్ కేబ...
11/04/2016

ఒకరు రామడుగు గ్రామంలో వందలమందికి విద్యా బుద్ధులు నేర్పిన గుడిబడి మాస్టారు నిరంజన్ సార్, మరొకరు అదే గ్రామంలో నవత డిష్ కేబుల్ నడిపించుకుంటూ అందరితో సరదాలు ఉండే పెరుమాళ్లు గారు, ఇద్దరిదీ ఒకే బాట చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండే వీరు గ్రామంలో ప్రతి ఏటా జరిగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి జీవిత చరిత్ర నాటకంలో పాత్రధారులు. ఈ నాటకంలో వీరి పాత్ర అజరామరం. కానీ వీరిరువురు శివైక్యం చెందడం వలన వీరు లేని లోటు ఎవరు తీర్చుతారో రేపు జరిగే నాటకంలో చూడాలి. వీరిద్దరికీ నా అశ్రునివాళులు.....

11/04/2016

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎంఎల్‌ఏ బొడిగె శోభ గారి ఇంటిలో చోరి జరిగింది. గంగాధర మండల కేంద్రంలో ఎంఎల్‌ఏ గారు అద్దెకు ఉంటున్న ఇంటిలో ఆదివారం రాత్రి సమయములో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి డిఎస్‌పి మల్లారెడ్డి, చొప్పదండి సిఐ లక్ష్మిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. గత 20 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు ఉండడంతో ఎం ఎల్‌ ఏ గారు స్థానికంగా ఉండకపోవడంతో ఇదే అదునుగా దుండగులు చోరీకి యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాభై వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు సుమారు తులం బంగారం, రెండు తులాల వెండి చోరికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

ఉగాది శుభాకాంక్షలు......
08/04/2016

ఉగాది శుభాకాంక్షలు......

PROJECT PRATHIGNYAతో చొప్పదండి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రామడుగులో పంపిణీ చేసిన కరపత్రాలు......
01/04/2016

PROJECT PRATHIGNYAతో చొప్పదండి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రామడుగులో పంపిణీ చేసిన కరపత్రాలు......

గత 62 సంవత్సరాలుగా రామడుగు గ్రామంలో  ప్రతి ఉగాది తర్వాత 4లేదా 5వ రోజున గొప్పగా జరిగే వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ఉచిత నాట...
31/03/2016

గత 62 సంవత్సరాలుగా రామడుగు గ్రామంలో ప్రతి ఉగాది తర్వాత 4లేదా 5వ రోజున గొప్పగా జరిగే వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ఉచిత నాటక ప్రదర్శన తేది 12-04-2016 న జరుగుతుంది. అందరం చూసి తరిద్ధాం.....

Address

Karimnagar
505531

Website

Alerts

Be the first to know and let us send you an email when రామడుగు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category