Mahendra freelance aptitude trainer

Mahendra freelance aptitude trainer Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahendra freelance aptitude trainer, Hyderabad.

29/11/2018

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,

నా పేరు సువర్ణ సంకసర్ల, నేను తెలంగాణ ఆడబిడ్డని.

విషయం: మీరు ఇదివరకు పక్క రాష్ట్రం వారు మన తెలంగాణాలో అధికారాన్ని చేజిక్కించుకోవలని చూస్తున్నారు అని మీరు స్వయంగా అనడం టీవీ న్యూస్ చానెల్స్, పేపర్స్ ద్వారా చూసి నేను facebook లో ఎవరి రాష్ట్రాన్ని వారు ఎవరి పరిధిలో వారు అభివృద్ధి చేసుకోండి పక్క రాష్ట్రం గురించి ఎందుకండి అని,రాష్ట్రాలు వేరైనా అందరం స్నేహపూర్వకంగా ఉండాలి అని పోస్ట్ పెట్టడం జరిగినది.దానికి కొంత మంది స్పందించి మీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ తో ఉన్నదాన్ని అప్పుల పాలు చేశారు, ఎన్నో డబ్బులు వృధా చేశారు అని, తెలంగాణాలో మీ ముఖ్యమంత్రి ని అడగడానికి ఏ ఒక్కరికి దమ్ము, ధైర్యం లేదు అందుకే పక్క రాష్ట్రం వాళ్ళము మేము ప్రశ్నిస్తున్నాము అన్నారు .
నేను మన తెలంగాణ ఆడబిడ్డ గా ఈ facebook ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను సార్.ఇలా అడగడం తప్పో, ఒప్పో తెలియదు కాని అడుగుతున్నాను. మీరు అప్పు చేసి పప్పు కూడులా అందరికి కొంత వరకు మంచే చేస్తున్నారు మీ పాలనలో.కానీ చాలా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చేస్తానని చెప్పిన చాలా పనులు, ప్రజలకు అందాల్సిన పథకాలు అందలేదు.తెలంగాణ రాకముందు లేని తేడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు సార్. నేను ఒక తేడా చూసాను సార్ మీ పాలనలో అదేమిటంటే
*బీసీ లోని ఒక కులానికి గొర్రెల పంపకం అని గొర్రెలు ఇచ్చారు కానీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు సార్ ?
*నిరుద్యోగులైన నా చదువుకున్న అన్నలకు, తమ్ముళ్లకు,అక్కలకి, చెల్లెళ్ళకి ఉద్యోగాలు ఏవి సార్ ?
*కొద్దిమంది మా అమ్మమ్మ, తాతలకు పెన్షన్ వస్తుంది కానీ చాలా మందికి ఎందుకు రావడం లేదు సార్ ? రానివారు బ్రతికి ఉన్నట్టా ? చనిపోయినట్టా?
*కేజీ నుండి పీజీ వరకు మా పిల్లలకు ఉచితంగా చదువులు అన్నారు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు ప్రవేశ పెట్టలేదు సార్ ?
*మిషన్ భగీరథ అని ఇంటింటికి నీళ్లు ఇస్తామని అన్నారు.ఇంతవరకు ఒక్క చుక్క నీరు లేదు.పైపులు ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయి ఉన్నవి. పైపులు నాణ్యత లేవు.
*ఏవి సార్ మాకు డబుల్ బెడ్ రూం ఇల్లులు.
ఇలా అడుగుతూ పోతుంటే చాలా ఉంటవి సార్.
మిగులు బడ్జెట్ తో ఉన్న మన రాష్ట్రం అప్పుల్లో చిక్కుకుంది.తర్వాత మన భావితరాలకు అప్పుల రాష్ట్రాన్ని చూపిద్దామా సార్.
మనిషికి కావాలసింది తాగటానికి నీరు, కడుపుకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. తెలంగాణ వస్తే కనీస అవసరాలు తీరుతాయి అనుకున్నాము కానీ ఏది సార్. వీటిల్లో ఏది పూర్తి చేశారని ఇంకా 9 నెలలు గడువు ఉండగానే శాసన సభ రద్దు చేశారు సార్.అంత అవసరం ఎందుకు వచ్చింది సార్.
ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత తెచ్చుకున్న తెలంగాణ మనది. మరొకరికి అధికారాన్ని మేము (తెలంగాణ ప్రజలము) కట్టబెట్టలేము. అందుకే ఏమి తెలియని పరిస్థితులలో మిమ్మల్ని అడుగుతున్నాను . తెలంగాణ ఇల్లు మనది కాబట్టి ఎవరో పరాయి ఇంటివాడు వచ్చి మన ఇంట్లో పెత్తనం చేస్తాను అంటే అధికారం కట్టబెట్టలేము కదా సార్. బాగా చూసుకున్న ,చుసుకోకపోయినా మన ఇంట్లో వారే ఉండాలి అనుకునే వాళ్ళము.
ఇప్పటికే అప్పులతో నిండిన తెలంగాణ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అప్పులల్లో కూరుకుపోతుంది అని అంటున్నారు.సార్ మనది బంగారు తెలంగాణ నా ? లేక అప్పుల తెలంగాణ నా ? మీరు దీనికి సమాధానం చెప్పండి సార్.

సువర్ణ సంకసర్ల
తెలంగాణ ఆడబిడ్డ

Last Day training program .
06/06/2018

Last Day training program .

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahendra freelance aptitude trainer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share