Kabaddi Lovers

Kabaddi Lovers Kabaddi Lovers I Love Kabaddi �

టేకుమట్ల గ్రామం 8వ వార్డులో నెలకొన్న  తాగునీటి ఎద్దడి సమస్యను గౌరవ కార్మిక శాఖ మంత్రి  వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి ...
01/05/2026

టేకుమట్ల గ్రామం 8వ వార్డులో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను గౌరవ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి టేకుమట్ల గ్రామానికి బోరు మంజూరు చేయడం అభినందనీయమైన విషయం.
ప్రజల సమస్యల పరిష్కారంలో చూపిన ఈ చొరవకు వార్డు సభ్యులందరూ మంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్, ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్, డిసిసి సెక్రెటరీ గోనె నర్సయ్య, వార్డు మెంబర్లు, స్థానిక వార్డ్ మెంబర్ పాత స్రవంతి జలంపల్లి మల్లేష్ గోనె అశోక్ అరుకుట శ్రీశైలం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి మారుత మారుతి పాత ప్రశాంత్ భాస్కర్ల వినోద్ ఈగ సురేందర్ రామచందర్ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.official

జగిత్యాల జిల్లా:నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శకుని ప్రత్యేక పూజలు చేసిన కార్మిక మ...
01/05/2026

జగిత్యాల జిల్లా:

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శకుని ప్రత్యేక పూజలు చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

మంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా ధర్మపురి ఆలయానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.ఎండోమెంట్ కమిషనర్ హనుమంత్ రావు.

పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.

తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించిన ఆలయ ఈవో శ్రీనివాస్.

*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్స్*

ఈ ప్రాంత ఆప్తులు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వారు ఇక్కడికి రావడం సంతోషం.

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆశీషులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.

టెంపుల్ సిటీ సర్వే లో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ధర్మపురికి రావడం సంతోషం గా ఉంది.

2016 లో గోదావరి పుష్కరాలు ధర్మపురి నుంచే మొదలుపెట్టడం జరిగింది.

ధర్మపురి ఆలయానికి మాస్టర్ ప్లాన్ రూపొందించి టెంపుల్ సిటీగా మారుస్తాం.

ఈ వచ్చే పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.

వచ్చే పుష్కరాలకు అత్యధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.

ధర్మపురికి ATC సెంటర్ కావాలని మంత్రి వివేక్ గారిని కోరడం జరిగింది.

నిరుద్యోగుల పక్షాన TOMCOM ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం శుభ పరిమాణం.

*మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్*

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.

గత కొన్ని ఏండ్లుగా ధర్మపురి ఆలయాన్ని టెంపుల్ సిటీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది.

గతబిఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నోచుకోలేదు.

వాస్తు శాస్త్ర ప్రకారం టెంపుల్ సిటీ నిర్మించడం జరుగుతుంది.

ప్రతి నియోజకవర్గానికి ATC సెంటర్ ను శాంక్షన్ చేస్తున్నాం.

శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ కి 2000 రూపాయల స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.

బడ్జెట్ లో దేశంలోనే అత్యధికంగా TOMCOM కు
90 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

విదేశాల్లో మంచి జీతాలు ఇస్తున్నారు.నెలకి సుమారు 2 లక్షల జీతాలు వస్తాయి.

విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఏజెంట్ ల మోసాల లను నమ్మొద్దు.official

01/05/2026





official

కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ📍 పాలకుర్తి మండలం, పెద్దపల్ల...
01/05/2026

కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

📍 పాలకుర్తి మండలం, పెద్దపల్లి
📅 తేదీ: 26/04/2026

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం (ఆర్చ్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి గ్రామ ప్రవేశ ద్వారాలు ఒక ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ సౌందర్యవృద్ధితో పాటు, స్థానికులకు గర్వకారణంగా ఈ ఆర్చ్ నిలుస్తుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

స్వంత నిధులతో ఈ గ్రామ ప్రవేశ ద్వారాన్ని నిర్మించిన రామ్ అఖిల్‌ను ఎంపీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎంపీ గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్ రవి మరియు ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.



26/04/2026
26/04/2026

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వర్యులు డా వివేక్ వెంకటస్వామి గారు.




Address

Chinnur
504201

Website

Alerts

Be the first to know and let us send you an email when Kabaddi Lovers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kabaddi Lovers:

Share