31/08/2026
🏏🇮🇳 ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ ఛాంపియన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన సత్కారం! 🇮🇳🏏
Differently Abled Cricket Council of Andhra Pradesh (DCCAP) లోని Blind Cricket కేటగిరీ కి చెందిన మన ఛాంపియన్ల అద్భుతమైన ప్రతిభ, అంకితభావం, క్రీడాభివృద్ధికి చేసిన విశేష కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహక నగదు పురస్కారాలతో సత్కరించడం ఎంతో గర్వకారణం.
🏏 మన కెప్టెన్ శ్రీమతి దీపిక T.C. గారికి ₹10 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు.
🏏 మన స్టార్ ప్లేయర్ శ్రీమతి కరుణ గారికి ₹15 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు.
🏏 అర్జున అవార్డు గ్రహీత, భారత పురుషుల బ్లైండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారికి క్రీడాభివృద్ధికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ₹2.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు.
ఈ సందర్భంగా మన ఛాంపియన్ల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి DCCAP తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙏
ముఖ్యంగా బ్లైండ్ క్రికెట్ క్రీడాకారులకు సాధారణ క్రికెట్ క్రీడాకారులతో సమానంగా అత్యుత్తమ శిక్షణ, సాధనకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) గౌరవ అధ్యక్షులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారికి, గౌరవ కార్యదర్శి శ్రీ సాన సతీష్ బాబు గారికి, APEX కమిటీ సభ్యులకు మరియు ACA Managementకు DCCAP తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙏
🏆 ఈ గౌరవం కేవలం మన ఛాంపియన్లకే కాదు... ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్‌కు, DCCAP కు దక్కిన ఘనమైన గుర్తింపు.
దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభను, పట్టుదలను, విజయాలను గుర్తించి ప్రోత్సహించే ఇటువంటి ప్రోత్సాహకాలు మరెందరో క్రీడాకారులకు కొత్త ఆశయాలను, మరింత ఉన్నత విజయాలను సాధించేందుకు స్ఫూర్తినిస్తాయి.
💐 మన ఛాంపియన్లకు హృదయపూర్వక అభినందనలు! 💐
మీ ప్రతిభ మరింత వెలుగొందాలి...
మీ విజయాలు మరెందరో దివ్యాంగ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలి...
భారత క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ పేరు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము! 🇮🇳🏏
DIFFERENTLY ABLED CRICKET COUNCIL OF ANDHRA PRADESH (DCCAP)
InclusiveCricket Champions AndhraCricket ProudMoment